కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ దేవదాస్. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. నాగార్జున కెరీర్‌లోనే బిగెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.
తాజాగా ఈ సినిమాలోని డిలీడెట్ సీన్‌ను హీరో నాని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. సినిమాలో డాక్టర్ దాస్, డాక్టర్ భరద్వాజ్ ల మధ్య జరిగే సన్నివేశాన్ని నాని ట్వీట్ చేశాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment