టీజర్‌లోని దృశ్యం
కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఈ చిత్ర టీజర్ శుక్రవారం విడుదలైంది. టీజర్‌లో ఏం చెప్పకున్నా.. సినిమా ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. టీజర్‌లో నాగ్, నాని కలిసి మందేయడం నవ్వులు పూయిస్తోంది. నాగార్జున ముందు నాని ఇచ్చిన అమాయక ఎక్స్‌ప్రెషన్స్.. దాసు ఏంటీ సంగతి అని నాగ్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచాయి.
మల్టీ స్టారర్ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్, నానికి జోడీగా రష్మికా మండన్నా యాక్ట్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment