హాలీవుడ్‌ సైతం ఆరా తీస్తున్న ఏకైక ఇండియన్‌ హీరో ప్రభాస్‌: నిర్మాత | Ashwini Dutt Sensational Comments On Prabhas Regarding Hollywood | Sakshi
Sakshi News home page

Prabhas: హాలీవుడ్‌ సైతం ఆరా తీస్తున్న ఏకైక ఇండియన్‌ హీరో ప్రభాస్‌: నిర్మాత

Published Mon, Jan 10 2022 7:54 PM | Last Updated on Mon, Jan 10 2022 8:07 PM

Ashwini Dutt Sensational Comments On Prabhas Regarding Hollywood - Sakshi

Ashwini Dutt Sensational Comments On Prabhas Regarding Hollywood: ఈశ్వర్‌గా సినిమా వంటి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి అభిమానుల గుండెల్లో డార్లింగ్‌గా ముద్ర వేసుకున్నాడు ప్రభాస్‌. అనేక చిత్రాలతో అలరించిన ప్రభాస్‌ బాహబలిగా మారి పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అప్పటినుంచి ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్‌లోనే తీస్తున్నాడు మిర్చి హీరో. ప్రభాస్‌ తరహాలో ఎవరూ ఇలా వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలు చేయలేదు. ప్రస్తుతం రాధేశ్యామ్‌ సినిమా విడుదల కానుంది. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో సలార్ చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు ఇటీవలే ప్రకటించారు. 

ఇవే కాకుండా సందీప్‌ వంగాతో 'స్పిరిట్‌', అశ్వనీదత్ నిర్మాతగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్‌ కె' కూడా కమిట్‌ అయ్యాడు. 'ప్రాజెక్ట్‌ కె' సినిమా కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్‌ దీపికా పదుకొణె నటిస్తుండగా వీరి ఇద్దరి మధ్య ఒక సన్నివేశాన్ని సైతం చిత్రీకరించారు. ఈ క్రమంలో నిర్మాత అశ్వనీదత్‌ ప్రభాస్‌పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ దర్శకులే కాకుండా హాలీవుడ్‌ డైరెక్టర్లు ప్రభాస్‌తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారట. హాలీవుడ్‌ డైరెక్టర్లు ఆరా తీస్తున్న ఏకైక ఇండియన్‌ హీరో ప్రభాస్‌ అని, 'ప్రాజెక్ట్‌ కె' తర్వాత డార్లింగ్‌ హాలీవుడ్‌ చిత్రాలకు పరిమితమైనా ఆశ్యర్యపోవాల్సింది లేదని గూస్‌ బంప్స్‌ తెప్పించే కామెంట్లు చేసినట్లు సమాచారం.  

ప్రభాస్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది బాహుబలి సినిమాతోనే. ఇందులో ప్రభాస్‌ ఆహ్యార్యం, స్క్రీన్‌ లుక్ హాలీవుడ్‌ దర్శకుల్ని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ ఓకే అంటే హాలీవుడ్‌ నుంచి అదిరిపోయే ఆఫర్లు ఇవ్వడానికి డైరెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు చిత్ర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టామ్‌ క్రూజ్‌ నటించిన ప్రముఖ హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రం మిషన్‌ ఇంపాజిబుల్‌  సిరీస్‌ తర్వాతి సినిమాలో ప్రభాస్‌ కూడా చేయనున్నట్లుగా ఆ మధ్య వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ప్రభాస్‌ తన ఫిజిక్‌లో మార్పులు రాకుండా జాగ్రత్త పడితే 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ ఇండియన్‌ హీరో ఫర్‌ హాలీవుడ్‌' అవుతాడని అంటున్నారు. ఇదిలా ఉంటే 'ప్రాజెక్ట్ కె' సినిమాలో మూడో ప్రపంచ యుద్ధం నుంచి ప్రజలను కాపాడే సూపర్‌ హీరోగా ప్రభాస్‌ కనిపించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 



ఇదీ చదవండి: 'స్పిరిట్‌'లో ప్రభాస్‌ రోల్‌ రివీల్‌ !.. ఇక ఫ్యాన్స్‌కు పండగే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement