ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా? | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: 'కల్కి', ఈ హాలీవుడ్ సినిమాలో ఒకేలాంటి కాన్సెప్ట్! ఏ ఓటీటీలో ఉందంటే?

Published Sat, Jun 15 2024 8:19 PM

Prabhas Kalki And Elysium Movie Comparisoin

డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజైంది. విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ లెవల్లో ఉన్నాయి. హిట్ అయితే గనుక టాలీవుడ్‌లో వండర్స్ క్రియేట్ అవుతాయి. అలానే ట్రైలర్ బట్టి చూసినా సరే కథ చూచాయిగా అర్థమవుతోంది గానీ పూర్తిస్థాయిలో ఇది స్టోరీ అని చెప్పలేకపోతున్నాం. మరోవైపు 'కల్కి' ట్రైలర్ రిలీజైందో లేదో అప్పుడెప్పుడో వచ్చిన ఓ హాలీవుడ్ మూవీతో పోల్చి చూస్తున్నారు. కొన్ని సీన్లు ఒకేలా అనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?

(ఇదీ చదవండి: చిక్కుల్లో చిత్ర పరిశ్రమ.. ఎలా ఉండేది ఎలా అయిపోయింది!)

'కల్కి' ట్రైలర్ బట్టి చూస్తే.. కొన్నేళ్ల తర్వాత భూమిపై పరిస్థితులు మారిపోతాయి. మనిషి మనుగడే కష్టమైపోతుంది. భూమికి చాలా ఎత్తులో కాంప్లెక్స్ అనే నిర్మాణం ఉంటుంది. అందులో ఉండే సుప్రీం యాష్కిన్ అనే పెద్ద మనిషి ఉంటాడు. అతడు హీరోయిన్‌ని పట్టుకోమని హీరో అయిన భైరవకి పని అప్పజెబుతాడు. హీరోయిన్‌ని ఆశ్వథ్ధామ అనే మరో వ్యక్తి కాపాడుతాడు. మరి చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.

ఇక 'కల్కి' ట్రైలర్‌లో ప్రభాస్.. కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని అంటుంటాడు. మరోవైపు దీనికి పోలిక అని చెబుతున్న సినిమా పేరు 'ఎలీసియమ్'. ఇందులో హీరో భూమిపై ఉంటాడు. 2154 సంవత్సరం. పేదలందరూ బాగా నాశనమైన భూమిపై ఉంటారు. డబ్బునోళ్లు అందరూ భూమికి దూరంగా అంతరిక్షంలో ఎలీసియమ్ అనే ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు. ఇలా 'కల్కి'లో కాంప్లెక్స్.. హాలీవుడ్ మూవీలో ఎలీసియమ్ అనేది ఒకేలా అనిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)

ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు.. భూమిపై దారుణమైన పరిస్థితుల్లో బతకడానికి ఇష్టపడరు. అక్కడెక్కడో ఆకాశంలో ఉంటున్న చోటుకి వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే చివరకు ఏమైందనేదే రెండు మూవీల్లోని స్టోరీ. హాలీవుడ్ మూవీ అయితే పూర్తిగా సీరియస్ టోన్‌లో ఉంటుంది. 'కల్కి' మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, డ్రామా, పురాణాల రిఫరెన్సులు బాగానే ఉన్నాయి.

ఓవరాల్‌గా చూసుకుంటే స్టోరీ ప్లాట్ పరంగా పైపైన ఒకేలా అనిపిస్తున్నాయేమో అనిపిస్తుంది. 'కల్కి' మూవీ రిలీజైతే ఇది అది ఒకటేనా కాదా అని తెలుస్తుంది. ఇంతకీ 'కల్కి'తో పోలిక అనిపిస్తున్న హాలీవుడ్ మూవీ ఏ ఓటీటీలో ఉందో చెప్పలేదు కదూ! ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పాత సినిమానే అయినప్పటికీ ఎందుకో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి.

(ఇదీ చదవండి: 'కన్నప్ప'లో ప్రభాస్‌ సీన్స్‌ గురించి మంచు విష్ణు కామెంట్స్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement