Dulquer Salmaan And Ashwini Dutt Talks About Sita Ramam Movie Success - Sakshi
Sakshi News home page

Sita Ramam Movie: మరో జన్మ ఎత్తినట్లుంది.. సీతారామం నిర్మాత

Published Tue, Aug 9 2022 3:33 PM | Last Updated on Tue, Aug 9 2022 4:12 PM

Dulquer Salmaan, Ashwini Dutt About Sita Ramam Success - Sakshi

సీతారామం చూసి కన్నీటి పర్యంతమవుతూ, ప్రభంజనం సృష్టిస్తుంటే నిర్మాతగా మరోజన్మ ఎత్తినంత తన్మయత్వానికి లోనవుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఓటీటీలు వచ్చాక ఇంకా జనాలు థియేటర్లకు ఎలా వస్తారు? అబ్బే, సినిమాలు ఆడటం ఇప్పుడంత సులువు కాదు, ఏదో భారీ బడ్జెట్‌ సినిమాలు అందులోనూ స్టార్‌ హీరో మూవీస్‌ అంటే మాత్రమే ప్రేక్షకులు థియేటర్‌ వైపు ఓ లుక్కిస్తారు.. ఇలా చాలా మాటలే వినిపించాయి. జూలైలో సినిమాలు వరుస ఫెయిల్యూర్స్‌ అందుకోవడంతో సినీపండితులు గాబరా పడ్డారు. కానీ ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సీతారామం, బింబిసార సూపర్‌ హిట్‌ విజయాన్ని అందుకున్నాయి. మీడియం రేంజ్‌ సినిమాలైనా కంటెంట్‌ ఉంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందేనని స్పష్టం చేశాయి. తాజాగా ఈ సినిమా సక్సెస్‌ అవడంతో చిత్రయూనిట్‌ సంబరాలు చేసుకుంటోంది. ఈ విజయంపై హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

'తెలుగులో డబ్‌ అయిన నా మొదటి సినిమా ఓకే బంగారం. ఇందుకు మణిరత్నంగారికి ధన్యవాదాలు. తర్వాత నాగి, వైజయంతి.. మహానటిలో జెమిని అనే నెగెటివ్‌ పాత్ర ఇచ్చారు. ఇక్కడా నన్ను ఆదరించారు. కనులు కనులను దోచాయంటే, కురుప్‌ కూడా డబ్‌ అయ్యాయి. ఇలా ప్రతి సినిమాను ఆదరిస్తూ నామీద చూపించిన ప్రేమాభిమానాలను నేనెన్నటికీ మర్చిపోలేను. స్వప్న, హను నన్ను సీతారామం కోసం అడిగారు. ఎప్పటినుంచో నేనొక యునిక్‌ సినిమాతో తెలుగులో స్ట్రయిట్‌ ఫిలిం చేయాలనుకున్నా.

ఇదొక క్వాలిటీ ఫిలిం కాబట్టి దీనితోనే ప్రయాణాన్ని ఆరంభించా. ఎంతోమంది ఆర్టిస్టులు, సిబ్బంది శ్రమ వల్లే సీతారామం ఇంత అందంగా వచ్చింది. సినిమా రిలీజ్‌ రోజు వచ్చిన స్పందన చూసి సంతోషంతో ఏడ్చేశాను. మా మీద మీరు చూపిస్తున్న ప్రేమకు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. సినిమాను ప్రేమించే తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీవాడిలా నన్ను భావించినందుకు మరోసారి కృతజ్ఞతలు.. మీ రామ్‌' అని ఓ లేఖ రాసుకొచ్చాడు.

మరోవైపు నిర్మాత అశ్వినీదత్‌ సైతం సినిమా విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు. సీతారామం సినిమాకు అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు రుణపడి ఉన్నానన్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, కేరళ ప్రేక్షకులు సైతం సీతారామం చూసి కన్నీటి పర్యంతమవుతూ, ప్రభంజనం సృష్టిస్తుంటే నిర్మాతగా మరోజన్మ ఎత్తినంత తన్మయత్వానికి లోనవుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ చిత్ర నిర్మాణాన్ని రెండేళ్లపాటు ఒంటిచేత్తో నడిపించి మరో చరిత్రకు శ్రీకారం చుట్టిన స్వప్నకు అభినందనలు తెలియజేస్తూ లేఖ విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ లేఖలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

చదవండి: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్‌
సోనమ్‌.. నీ ఫ్రెండ్స్‌ ఎంతమందితో అతడు బెడ్‌ షేర్‌ చేసుకున్నాడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement