సెలబ్రిటీలు అనగానే వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొందరు నెపోటిజం కిడ్స్‌కి మినహా మిగిలిన వాళ్లందరూ ఓ మాదిరి కష్టాలు పడిన తర్వాతే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ ఉంటారు. బాలీవుడ్ యంగ్ హీరో అభయ్ వర్మది కూడా అలాంటి పరిస్థితే. చిన్న చిన్న పాత్రలు, యాడ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. రీసెంట్‌గా వచ్చిన 'ముంజ్య' అనే హారర్ మూవీతో హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. అలా గతంలో తనకు జరిగిన షాకింగ్ సంఘటనని బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)
హర్యానాలోని మధ్య తరగతి కుటుంబానికి చెందిన అభయ్ వర్మ తండ్రి చిన్నప్పుడే మంచానికి పరిమితమయ్యాడు. దీంతో ఇల్లు తాకట్టు పెట్టి మరీ తల్లి.. పిల్లల బాగోగులు చూసింది. ఓవైపు చదువుతూనే నటుడి అవ్వాలని అభయ్ ఫిక్సయ్యాడు. అలా 'సూపర్ 30' మూవీలో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు. గతేడాది 'సఫేద్' మూవీలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఈ మూవీ చేస్తున్నప్పుడు ఓ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికెళ్తుంటే తనని హిజ్రా అనుకుని కొందరు కుర్రాళ్లు ఇబ్బంది పెట్టారని అభయ్ చెప్పుకొచ్చాడు.
'ఓ రోజు రాత్రి హోటల్‌కి తిరిగెళ్తుంటే కొందరు తాగుబోతులు ఎదురుపడ్డారు. హిజ్రా అనుకుని అడ్డగించి నాతో అసభ్యంగా ప్రవర్తించారు. పరిస్థితి చేయి దాటిపోయేసరికి నేను నిజం చెప్పాల్సి వచ్చింది. నేను అబ్బాయిని, సినిమా కోసమే ఈ వేషం వేసుకున్నానని చెప్పడంతో వాళ్లు నన్ను వదిలేశారు' అని అభయ్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే ట్రాన్స్ జెండర్ రోల్ చేస్తున్నప్పుడు పాత్ర ఫెర్ఫెక్షన్ కోసం ఆ గెటప్‌లోనే పలువురిని కలిసేవాడినని చెప్పిన అభయ్.. ఈ క్రమంలోనే చాలా అవమానాలు కూడా ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ కుర్రాడు 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో కూడా హీరో కూతురిని మోసం చేసే కుర్రాడి పాత్రలో నటించాడు.
(ఇదీ చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఆ అవకాశమే లేదు!)
Comments
Please login to add a commentAdd a comment