ఫ్యామిలీ మ్యాన్‌-3లో నటించనున్న విజయ్‌ సేతుపతి? | South Indian Actor Vijay Sethupathi Will Act Family Man Web Series 3rd | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ మ్యాన్‌-3లో నటించనున్న విజయ్‌ సేతుపతి?

Published Sun, Jun 20 2021 5:59 PM | Last Updated on Sun, Jun 20 2021 7:08 PM

South Indian Actor Vijay Sethupathi Will Act Family Man Web Series 3rd - Sakshi

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో విశేష ప్రేక్షకాదరణ పోందుతూ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో విడుదలైన రెండు సీజన్లకు ఓటీటీ వాసులు బ్రహ్మరథం పట్టారు.దీనికి కొనసాగింపుగా సీజన్‌-3 కూడా రానున్న నేపథ్యంలో మేకర్స్‌ రాజ్‌ అండ్‌ డీకే తదుపరి సీజన్‌ను ఓ రేంజ్‌లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సౌత్‌ స్టార్‌ తమిళ నటుడు విజయ్‌ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

ఫ్యామిలీ మ్యాన్‌-3లో విజయ్‌ నటించనున్నాడా ?
ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం, ఓటీటీ కి ప్రేక్షకాదరణ పెరగడంతో తారల అడుగు ఓటీటీ వైపు పడుతోంది. ఈ క్రమంలో ఇటీవల సామ్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఇదే తరహాలో ఇప్పుడు విజయ్‌ సేతుపతి కూడా ఓటీటీలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అసలు సీజన్‌-2 కే సేతుపతి నటించాల్సి ఉండగా అది కుదరలేదు. కాగా తదుపరి సీజన్‌లో విజయ్‌ సేతుపతి రాకతో ఈ సిరీస్‌ కు మరింత హైప్‌ తీసుకురావాలని మేకర్స్‌ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి విజ‌య్ సేతుప‌తి నిజంగానే ఫ్యామిలీ మ్యాన్‌లో న‌టించ‌నున్నాడా? న‌టిస్తే ఏ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌న్న దానిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

కాగా ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సిరీస్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. మొద‌టి సిరీస్‌కు కొన‌సాగింపుగా వ‌చ్చిన ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఇక సీజన్‌ 2 లో ప్రత్యేకంగా చెప్పలాంటే సమంత తన నటనతో సీజన్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇందులో సామ్‌ నటనతో పాటు స్టంట్స్‌ కూడా ఇరగదీసిందనే చెప్పాలి.
చదవండి: ‘అర్జున్‌ రెడ్డి’లా పవన్‌ కల్యాణ్‌.. ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్న ఓల్డ్‌ పిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement