Shahid Kapoor Praises Samantha And Her Acting In The Family Man 2 Web Series - Sakshi
Sakshi News home page

Samantha: ఆమెతో కలిసి నటించడమే నా కల: బాలీవుడ్‌ హీరో

Published Tue, Sep 28 2021 3:27 PM | Last Updated on Tue, Sep 28 2021 7:50 PM

Shahid Kapoor Praises Samantha And Her Acting In The Family Man 2 Web Series - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం ట్విటర్‌లో లైవ్‌ సెషన్‌ నిర్వహించి అభిమానులతో ముచ్చటించాడు షాహిద్‌. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో షాహిద్‌ రాజ్‌ అండ్‌ డీకేలతో కలిసి చేసిన తన వెబ్‌ సిరీస్‌, జెర్సీ మూవీలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ గురించి అడిగాడు. దీంతో షాహిద్‌ ఈ వెబ్‌ సిరీస్‌ తనకు బాగా నచ్చిందని ముఖ్యంగా ఇందులో సమంత నటనకు ఫిదా అయ్యానని చెప్పాడు. 

చదవండి: పవన్‌ కల్యాణ్‌ రెమ్యునరేషన్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు

అంతేగాక ‘ఈ సిరీస్‌ చూస్తున్నంత సేపు తనతో, తన నటనతో ప్రేమలో పడిపోయాను. చెప్పాలంటే ఈ షో మొత్తంలో సమంత నటన నన్ను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి పెరిగింది. ఇప్పుడు తనతో ఓ సినిమా చేయడమే నా కల’ అంటూ సామ్‌పై షాహిద్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

కాగా రాజ్‌-డీకే దర్శకత్వలో క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’లో సమంత నెగిటివ్‌ షెడ్స్‌ ఉన్న రాజీ పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్‌ కూడా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక షాహిద్‌ కపూర్‌ సినిమాల విషయానికొస్తే.. రాజ్‌ అండ్‌ డీకేలతో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేశాడు. ఈ సిరీస్‌ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. అలాగే అతడు నటించి జెర్సీ మూవీ రీమేక్‌ కూడా షూటింగ్‌ పూర్తి చేసుకుందని, ఈ ఏడాది డిసెంబర్ 31 విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు షాహిద్‌ తెలిపాడు. 

చదవండి: మందు గ్లాస్‌తో పూరికి బర్త్‌డే విషెస్‌ తెలిపిన చార్మీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement