
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మార్మోగిపోయిన వెబ్ సిరీస్ ఏదైనా ఉందా? అంటే అది 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'నే. విమర్శలు, ప్రశంసలు, వివాదాలు, వాదనలతో ఈ సీజన్‌కు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. అందులో యాక్ట్ చేసిన నటీనటులకు కూడా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఇందులో మనోజ్ తివారీ నటించిన శ్రీకాంత్ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. మొదటి సీజన్‌లో అతడికి కూతురిగా నటించిన ఆశ్లేష ఠాకూర్ కూడా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఆన్‌స్క్రీన్ బాయ్‌ఫ్రెండ్‌తో ముద్దు సీన్లలోనూ నటించింది. అయితే ఇలాంటి సన్నివేశాల్లో నటించడం అంత ఈజీ కాదంటోందీ భామ.
17 ఏళ్ల ఆశ్లేష తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ముద్దు సీన్లలో నటించడం నాకు కొత్త కావడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. చిన్నపిల్లలా ఏదో విధంగా చేసేయకుండా అవి చాలా సహజంగా రావాలనుకున్నాను. ఇందుకోసం ప్రేమ మిళితమై ఉండే వెబ్ సిరీస్‌లు చూశాను. చాలా రీసెర్చ్ చేశాను. ఎంత అధ్యయనం చేసినప్పటికీ షూటింగ్ వరకు వచ్చేసరికి అదంత సరదాగా ఏమీ ఉండదు. అయితే నటిగా నేను చేసే పాత్రలో లీనమైపోవాలి. ముద్దు సన్నివేశం తెర మీద ఎలా వస్తుందనే దాని గురించి నేను పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దర్శకనిర్మాతల మీద పూర్తి నమ్మకముంచాను. అయినా ఆ సీన్ చాలా సాంకేతికంగా జరిగిపోతుంది' అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment