panchayath
-
పట్నం.. ఇక నగరం!
ప్రాచీన పురపాలక సంఘం మచిలీపట్నం..ఇకపై నగరపాలకసంస్థ కానుంది. ఏళ్లుగాకలగానే మిగిలిన కార్పొరేషన్ హోదా త్వరలోనేనెరవేరనుంది. మూడేళ్ల క్రితం కార్పొరేషన్హోదా కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడినా..కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం మున్సిపాలిటీపాలకవర్గాల పదవీ కాలం కొద్ది రోజులుమాత్రమే ఉండటంతో అప్పట్లో వెలువడినఉత్తర్వుల ప్రకారం మున్సిపాలిటీ కార్పొరేషన్గారూపుదిద్దుకునేందుకు అడుగులు పడుతున్నాయి. జూలై 3వ తేదీ నుంచి కార్పొరేషన్గామార్చి పాలన సాగించేందుకు అవసరమైనఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. సాక్షి,కృష్ణాజిల్లా, మచిలీపట్నం: మచిలీపట్నం 1886లో పురపాలక సంఘంగా రూపాంతరం చెందింది. 42 వార్డుల పరిధిలో 1.80 లక్షల జనాభా నివసిస్తున్నారు. బందరును నగరపాలక సంస్థగా పరిగణించాలని 2015 సెప్టెంబరు 29న ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో జారీ అయిన వారం రోజుల్లోనే మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్సిపల్ పాలకులు గడువు కంటే ముందే అంటే.. జీవో వచ్చిన మరుసటి రోజే కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించేశారు. అప్పుడే అందరూ బందరు కార్పొరేషన్ అయిపోయిందని భావించారు. నగరపాలక సంస్థ కావాలంటే 3 లక్షలకుపైగా జనాభా ఉండాలి. బందరులో ఆ మేరకు జనాభా లేదు. దీంతో మచిలీపట్నంకు పక్కనున్న గ్రామాలను సైతం విలీనం చేయాలని భావించారు. ఇవన్నీ చేయకుండా ఉంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనికి తోడు పాలకవర్గాలు కొలువుదీరి ఏడాదిన్నర కాలం కూడా గడవకుముందే మళ్లీ ఎన్నికలంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని గుర్తించిన ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల వరకు ఆగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీఓను పక్కనబెట్టేశారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం అధికారులు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా తీర్చి దిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. జూలై 3వ తేదీ నుంచి బందరు నగర పాలక సంస్థ కార్పొరేషన్ హోదాలో పాలన సాగించనుంది. అప్పుడలా.. బందరు కార్పొరేషన్‌గా రూపాంతరం చెందితే ప్రస్తుతం ఉన్న 42 వార్డుల స్థానంలో డివిజన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఒక్కో డివిజన్‌కు 6 వేల మంది జనాభా ఉండాలి. నగర పాలక సంస్థలో 50 డివిజన్లు ఉండాలి. కానీ ప్రస్తుతం పట్టణంలో 30 డివిజన్లు ఉన్నాయి. దీంతో అప్పట్లో బందరుకు సమీపంలో ఉన్న సుల్తానగరం, అరిశేపల్లి, గరాలదిబ్బ, పోతేపల్లి, మేకవానిపాలెం,పెడన మున్సిపాలిటీ, గూడూరు మండలంలోని కప్పలదొడ్డి, పోసినవారిపాలెం, ఆకులమన్నాడు, కోకనారాయణపాలెం, నారికేడలపాలెంలను బందరు కార్పొరేషన్లో విలీనం చేయాలనుకున్నారు. ఇప్పుడిలా.. ప్రస్తుతం విలీనం ప్రక్రియను పక్కనబెట్టి పట్టణాన్నే కార్పొరేషన్‌గా చేయాలని మున్సిపల్ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో పట్టణంలోని 42 వార్డులనే 50 డివిజన్లుగా రూపుదిద్దాలని అధికారులు భావిస్తున్నారు. కార్పొరేషన్ హోదాలోనే ఎన్నికలు.. మున్సిపాలిటీ పాలకవర్గ పదవీ కాలం జూలై 2తో ముగియనుంది. సార్వత్రిక ఎన్నికలు సైతం ఇప్పటికే ముగిశాయి. ఈ తరుణంలో కార్పొరేషన్ హోదాలో వచ్చే ఎన్నికలను నిర్వహించనున్నారు. రెండేసి వార్డులు కలిపేసి ఒక డివిజన్‌గా రూపుదిద్దనుండటంతో వార్డులకు అన్నీ తామై వ్యవహరిస్తున్న కౌన్సిలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 3 నుంచి కార్పొరేషన్ హోదా.. బందరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ 2015లోనే ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పట్లో అభ్యంతరాలు రావడంతో సార్వత్రిక ఎన్నికల అనంతరం అమలు చేయాలని ఉత్తర్వులు అందాయి. దీంతో కార్యాచరణ ప్రారంభించాం. డివిజన్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదించాం. పట్టణంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఇవ్వాలని కలెక్టర్‌కు నివేదించాం. డివిజన్ల ఏర్పాటు, జనాబా వర్గీకరణ తదితర అంశాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తాం.–పీజే సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ -
చావు కూడు పెట్టలేదని దారుణంగా...
బర్మార్ (రాజస్తాన్): అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ మూఢనమ్మకాలు, వింత ఆచారాలతో కుటుంబాల్ని వెలివేసే సంస్కృతి నేటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇటువంటి సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వింత ఆచారం కారణంగా రాజస్తాన్‌లోని బర్మార్ అనే గ్రామానికి చెందిన ఓ కుటుంబాన్ని వెలివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... బర్మార్ జిల్లాలోని చోటాన్ అనే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మూడేళ్ల క్రితం మరణించాడు. అయితే ఆ గ్రామ ఆచారం ప్రకారం.. ఆర్ధిక పరిస్థితితో నిమిత్తం లేకుండా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు తమను పరామర్శించిన వారికి కచ్చితంగా విందు ఏర్పాటు చేయాలి. దీనిని ‘మృత్యుభోజ్’ (పెద్దకర్మ వంటిది) అంటారు. కానీ మరణించిన వ్యక్తి నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో అతడి కుటుంబ సభ్యులు విందు ఏర్పాట్లు చేయలేకపోయారు. దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు ఆ కుటుంబాన్ని నానా రకాలుగా వేధించడం మొదలుపెట్టారు. పెళ్లి చేసుకోవద్దంటూ హెచ్చరికలు.. బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ... మృత్యుభోజ్ ఏర్పాటు చేయని కారణంగా తమకు ఉన్న కొద్దిపాటి భూమిని పంచాయతీ పెద్దలు లాక్కున్నారని ఆరోపించాడు. తమను ఇంటి నుంచి వెళ్లగొట్టి.. ఐదు లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా వేధిస్తున్నట్లు తెలిపాడు. ఊళ్లో జరిగే వేడుకలకు తమను ఆహ్వానించకుండా అవమానానికి గురిచేస్తున్నారన్నాడు. చిన్న పిల్లల్ని బడిలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయాడు. తమ ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారని... వారిని ఎవరూ పెళ్లి చేసుకోవద్దంటూ పంచాయతీ పెద్దలు 21 గ్రామాలకు చెందిన యువకులను హెచ్చరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడేళ్లుగా ఈ అన్యాయాలను సహిస్తున్నామని.. ఓపిక నశించడంతో బకాసర్ పోలీస్‌స్టేషన్‌లో గత నెల 11న ఫిర్యాదు చేశామని తెలిపాడు. కాగా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బర్మార్ ఎస్పీ గంగదీప్ సింగ్లా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ప్రజావసరాలను తీర్చేలా పంచాయతీలు
గ్రామీణాభివృద్ధిపై వర్క్‌షాప్‌లో మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లోని ప్రజల అసరాలను తీర్చగలిగేలా పంచాయతీలు స్వయంసమృద్ధి సాధించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. గ్రామ సభల్లో స్థానిక ప్రజలను భాగస్వాములను చేసి వారు కోరుకుంటున్న విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (టిసిపార్డ్)లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం.. తదితర అంశాలు ప్రధాన సమస్యలుగా కనిపిస్తున్నాయని, ఆయా సమస్యలను పరిష్కరించేందుకు గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు సర్పంచు లు, కార్యదర్శులు శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిని గ్రామాల్లో అర్హులైన వారికి అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులదేనన్నారు. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు, పంచాయతీల సొంత వనరులు, ఉపాధి హామీ నుంచి అందే నిధులతో గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిధ్ధం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి, శిక్షణ పూర్తిచేసుకున్న వారికి తగిన సంస్థలలో ఉపాధి అవకాశాలను కల్పించాలని గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులను మంత్రి ఆదేశించారు. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ మాట్లాడుతూ.. తాగు నీరు, పారిశుధ్యం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులను విడుదల చేసిందని, వాటిని వీలైనంత త్వరగా ఖర్చు చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గ్రామ పంచాయతీలను పటిష్ట పరిచేందుకు ఉపాధిహామీ పథకం నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డెరైక్టర్ అనితారాంచంద్రన్ సూచించారు. -
నగర పంచాయతీలకు ప్రతిపాదనలు
20 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీలకు అవకాశం ఎస్ కోట, చీపురుపల్లి, కొత్తవలసలను ప్రతిపాదించేందుకు చర్యలు విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో మేజర్ పంచాయతీలను నగరపంచాయతీలుగా మార్చే ప్రతిపాదన మరో మారు తెరపైకి వచ్చింది. 20 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీల జాబితాను త్వరితగతిన పంపించాలని గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ ఎంఎం నాయక్, జిల్లా పంచాయతీ అధికారులను సంబంధిత జాబితా సిద్ధం చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరానికి కార్పొరేషన్ హోదా కల్పించేందుకు ప్రతిపాదన స్వీకరించిన ప్రభుత్వం, తాజాగా నగర పంచాయతీల మార్పునకు ప్రతిపాదనలు కోరింది. ఎస్.కోట, చీపురుపల్లి, కొత్తవలస పంచాయతీలకు అవకాశం జిల్లాలో కొత్తవలస, జామి, ఎస్.కోట, ధర్మవరం, కొండపాలెం, చీపురుపల్లి, గర్భాం, భోగాపురం, గజపతినగరం, రామభద్రాపురం, మక్కువ, తెర్లాం, కురుపాం, ఎల్.కోట, పెదభోగిలి మేజర్ పంచాయతీలు. వీటిలో ఎస్.కోట, చీపురుపల్లి, కొత్తవలస పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు ఇప్పటికే పలు మార్లు ప్రతిపాదించారు. ఈ సారి కూడా వాటినే ప్రతిపాదించారు. చీపురుపల్లి మేజర్పంచాయతీలో 40 వేలు, ఎస్.కోట పంచాయతీలో 30 వేలు , కొత్తవలస మేజర్ పంచాయతీలో 35 వేల మంది జనాభా ఉన్నారు. ఈ మూడింటినీ ప్రతిపాదిస్తూ రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ రాజు తెలిపారు.