'సమంత బికినీ వేసిందట' | Talk of the town, Samantha's bikini in 'sikander' | Sakshi
Sakshi News home page

'సమంత బికినీ వేసిందట'

Published Sat, Aug 16 2014 3:04 PM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM

'సమంత బికినీ వేసిందట' - Sakshi

'సమంత బికినీ వేసిందట'

ఇప్పుడు ఏ నోట విన్నా ఒకటే మాట.. 'సమంత బికినీ వేసిందట'! మొదటి సినిమా 'ఏ మాయ చేశావె' నుంచి నిన్న మొన్న వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వరకు దాదాపు అన్ని సినిమాల్లోనూ చాలా పద్ధతిగా కనిపించిన సమంత.. తాజాగా విడుదలైన 'సికిందర్' సినిమాలో మాత్రం టూపీస్ బికినీ వేసుకుని అందాలు ఆరబోసింది. సూర్య సరసన నటించిన ఈ చిత్రంలో ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచేయడం వెనక సీక్రెట్ ఏంటని అంతా ఆలోచిస్తున్నారు.

సికిందర్ సినిమా గురించి విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా కొంచెం పెదవి విరిచినా, సమంత విషయానికి వచ్చేసరికి మాత్రం అంతా ఆమె గ్లామర్కు ఏకగ్రీవంగా నూటికి రెండొందల మార్కులు వేసేశారు. ఓ పాటలో కేవలం కొద్ది సెకన్ల పాటు మాత్రమే సమంత బికినీలో కనిపించినా, అది మాత్రం అందరినీ ఆకట్టుకుంది. తమలాంటి అభిమానులకు అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయమని, ఆమె గ్లామర్ చూసి చాలా సంతోషించామని సమంత వీరాభిమాని రాజేష్కుమార్ అన్నాడు. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలలో అయితే ఆమె బికినీ ఫొటో ఎన్నిసార్లు షేర్ అయ్యిందో లెక్కలేదు. సికిందర్ సినిమాలో సమంత బికినీ సీన్ లేకపోతే ఆ సినిమా అంత ఆడేది కాదని కూడా కొంతమంది వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement