Solanki
-
మిస్టరీ గర్ల్ హార్దిక్ పాండ్యా..
-
ప్రియాంక చోప్రా సినిమాలో నటించాడు.. ఇప్పటికీ పండ్లు అమ్ముతూ!
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కలల ప్రపంచం. సినిమాల్లో ఛాన్సుల కోసం ఎంతో మంది వేచి చూస్తుంటారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు ఇండస్ట్రీలో తన టాలెంట్‌లో ముందుకు దూసుకుపోతుంటారు. అలా స్టార్స్ పక్కన నటించడమంటే ఇక వాళ్ల కెరీర్ వేరే లెవల్లో ఉంటుంది. కానీ కొందరు మాత్రం స్టార్స్ సినిమాల్లో అవకాశాలొచ్చినా.. తమ వృత్తిని అలాగే కొనసాగిస్తుంటారు. అలాంటి వ్యక్తే ఈ సోలంకి దివాకర్. బాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సోలంకి తన వృత్తిలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్, ది వైట్ టైగర్, సోంచిరియా లాంటి చిత్రాలలో సోలంకి దివాకర్ నటించారు. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన పండ్ల వ్యాపారంలోనే కొనసాగుతున్నారు. అతను సినిమాల్లోకి రాకముందు వృత్తి రీత్యా పండ్ల వ్యాపారి. ఢిల్లీలో 10 సంవత్సరాలుగా పండ్లు విక్రయిస్తున్నారు. నటనపై ఇష్టం ఉన్న సోలంకి సినిమాల్లోకి వచ్చాడు. అయితే లాక్డౌన్లో చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో కుటుంబ పోషణ కోసం పండ్ల వ్యాపారం చేసినట్లు వెల్లడించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సోలంకి మాట్లాడుతూ..'నటన అంటే నాకు మొదటి నుంచే ప్రేమ. నా స్వస్థలమైన అచ్నేరా (ఉత్తరప్రదేశ్‌లోని) థియేటర్లో విరామ సమయంలో పాపడ్ అమ్ముతు ఉండేవాన్ని. అప్పుడే నటన పట్ల మక్కువ పెంచుకున్నా. ఈరోజు నేను సినిమాల్లో నటించి సరిపడా డబ్బు సంపాదించలేకపోయాను. నా కుటుంబాన్ని పోషించడానికి పండ్లు అమ్ముతున్నాను. సినిమాల్లో నాకు తగినంత జీతం వస్తే పండ్లు అమ్మను. అవకాశం దొరికితే 1000 సినిమాల్లో నటించాలనుకుంటున్నా. కానీ నాకు తరచుగా పాత్రలు రావడం లేదు. దీంతో వేరే మార్గం లేనందున నేను పండ్లు అమ్మవలసి వస్తోంది' అని అన్నారు. -
కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..
-
గుజరాత్ బీజేపీ మాజీ ఎంపీకి షాక్
అహ్మదాబాద్ : ఆర్టీఐ కార్యకర్త సంచలన హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీ, మైనింగ్ మాఫియా దిను బోఘా సోలంకికి అహ్మదాబాద్ సీబీఐ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. సోలంకితో పాటు ఈ కేసులో దోషులందరికీ జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గత శనివారం సోలంకి తోపాటు మరో ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు గురువారం వీరికి శిక్షలను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. అలాగే వీరికి 59,25,000 రూపాయలు జరిమానా కూడా విధించింది. ఈ సొమ్ములో రూ.11 లక్షలు ఆర్టీఐ కార్యకర్త కుటుంబానికి అందజేయాలని ఆదేశించింది. ముఖ్యంగా భార్యకు రూ. 5 లక్షలు, ఇద్దరు పిల్లలకు రూ.3 లక్షల చొప్పున ఏదైనా జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చెప్పింది. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఆర్టీఐలో పిల్ దాఖలు చేసిన నెలరోజుల్లోనే ఆర్టీఐ కార్యకర్త అమిత్ జేత్వా హత్య గురయ్యారు. జూలై 20, 2010న గుజరాత్ హైకోర్టు ఆవరణలో సోలంకి, మరికొంతమందితో కలిసి అమిత్‌ను దారుణంగా హత్య గావించారన్న సీబీఐ వాదనలను కోర్టు విశ్వసించింది. దీంతో దిను సోలంకి మేనల్లుడు శివ సోలంకి, శైలేష్ పాండ్యా(షూటర్) తోపాటు బహదూర్‌సింగ్ వాధర్, పంచన్ జి దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉదాజీ ఠాకకూర్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక న్యాయమూర్తి కెఎం డేవ్ జీవిత ఖైదు శిక్షను విధించారు. మరోవైపు తన కుమారుడు అమిత్ జేత్వా హత్య పై సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న తండ్రి భిఖిభాయ్ జేత్వా ఈ తీర్పు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాజా తీర్పు భారత న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి లభించిన విజయమని పేర్కొన్నారు. ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందన్నారు. చదవండి : సంచలన హత్యకేసులో బీజేపీకి షాక్ -
కుర్రాళ్లపైనే భారం!
నేటి నుంచి కొరియాతో డేవిస్ కప్ పోరు డబుల్స్‌లో బోపన్న జతగా పేస్ చండీగఢ్: కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడటం... బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు అనుభవం లేకపోవడం, సమన్వయ లోపం వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్... డేవిస్ కప్ పోరుకు సిద్ధమైంది. ఆసియా ఓసియానియా గ్రూప్-1లో భాగంగా నేటి (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో భారత్... కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సమస్యలున్నా ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గాయాల కారణంగా యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్‌లు గైర్హాజరీతో.. 21 ఏళ్ల రామ్‌కుమార్‌కు డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. చెన్నైకి చెందిన ఇతనికి అనుభవం లేకపోయినా నైపుణ్యానికి మాత్రం కొదువలేదు. ఇక సాకేత్ మైనేని అనుభవం ఉన్నా... భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతను ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలా అత్యవసరం. ఓవరాల్‌గా సీనియర్లు లేకపోవడంతో ఇప్పుడు ఈ కుర్రాళ్లపై భారత్ నమ్మకం పెట్టుకుంది. అయితే ప్రత్యర్థి జట్టుకు అనుభవం లేకపోవడం, సొంతగడ్డపై మ్యాచ్‌లు జరుగుతుండటం ఈ ఇద్దరికి కలిసొచ్చే అంశం. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హరియాణా, పంజాబ్ గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకీ డేవిస్ కప్‌కు సంబంధించిన డ్రాను విడుదల చేశారు. దీని ప్రకారం కొరియా నుంచి భారత్‌కు పెద్దగా ఇబ్బందులేమీ కనిపించడం లేదు. 2008 తర్వాత భారత్‌లో గ్రాస్‌కోర్టుపై డేవిస్ మ్యాచ్‌లు జరగడం ఇదే తొలిసారి. అప్పట్లో న్యూఢిల్లీలో జరిగిన పోరులో భారత్ 3-2తో జపాన్ను ఓడించింది. శుక్రవారం జరిగే తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ (217)... సియోంగ్ చెన్ హాంగ్ (427)తో; రెండో సింగిల్స్‌లో సాకేత్... యంగ్ యూ లిమ్తో తలపడతారు. జత కుదిరేనా..! సీనియర్ ఆటగాళ్లు లియాండర్ పేస్-రోహన్ బోపన్నలు మరోసారి డేవిస్ కప్‌లో జతగా బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ జోడీపైనే అందరి దృష్టి నెలకొంది. గతంలో పేస్-బోపన్న... చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైనా... సెర్బియాతో పోరులో మాత్రం అద్భుతంగా ఆడారు. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో ఆడాలని అందరూ కోరుకుంటున్నా... ఈ ఇద్దరి మధ్య సమన్వయం కుదురుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల రియో ఒలింపిక్స్ కోసం బోపన్న.. సాకేత్ పేరును సూచించగా ఏఐటీఏ జోక్యం చేసుకుని పేస్‌ను జోడీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కొరియాపై భారత్ గెలవాలంటే పేస్-బోపన్న డబుల్స్‌లో సత్తా చాటాలి. శనివారం జరిగే డబుల్స్‌లో పేస్-బోపన్న జంటతో... హాంగ్ చుంగ్-యున్‌సియోంగ్ చుంగ్లు తలపడతారు. బుధవారమే చండీగఢ్‌కు చేరుకున్న పేస్.. గంటన్నర పాటు ప్రాక్టీస్ చేశాడు. గతాన్ని మర్చిపోయి కలిసి ఆడతామని పేస్, బోపన్న చెబుతున్నా.. మైదానంలో ఏమేరకు సమన్వయం కుదురుతుందో చూడాలి.