నేను ఆడగలను, పాడగలను..ఇక నాకేంటి! | I can act, sing, Ayushmann khurana on his biggest plus point | Sakshi
Sakshi News home page

నేను ఆడగలను, పాడగలను..ఇక నాకేంటి!

Published Mon, Mar 10 2014 2:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

I can act, sing,  Ayushmann khurana on his biggest plus point

ముంబై:విక్కీ డోనర్ సినిమాతో విజయం సాధించి బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆయూష్మాన్ ఖురానా తాను ఒక్క నటనకే పరిమితం కాదని, అవసరమైతే పాటలతో కూడా అలరిస్తానని తెలిపాడు.  తనకు నటించడంతో పాటు పాటలు పాటడం ఒక ప్లస్ పాయింట్ గా పేర్కొన్నాడు.  ప్రస్తుతం బాలీవుడ్ యువకుల హవా కొనసాగుతుందన్నాడు. ఆ ప్రవాహంలో తాను నిలదొక్కుకోగలననే ఆశాభవం వ్యక్తం చేశాడు. తనకు నటనతో పాటు పాటల పాడటం అదనపు బలంగా పేర్కొన్నాడు. ఈ రెండు అంశాలతో తాను బాలీవుడ్ దూసుకుపోగలనని ఆయూష్మాన్ తెలిపాడు.  తనకి సీనియర్ నటుడైన రణ్బీర్ కపూర్ పని విధానం ఆకట్టుకుందన్నాడు.

 

వీర్య దానం మెయిన్ కాన్స్ ప్ట్ గా ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన విక్కీ డోనర్ మూవీ జనానికి బాగా నచ్చింది. ఓ డాక్టర్ ప్రోద్బలంతో డబ్బు కోసం ఎక్కువ మందికి వీర్యదానం చేసిన హీరో ఆ తర్వాత పడే కష్టాల చుట్టూ తిరిగిన విక్కీ డోనర్ మూవీ హిట్ కొట్టేయడంతో ఆయూష్మాన్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న బేవకూ ఫియాం చిత్రంపై దృష్టి సారించాడు. ఈ చిత్రంతో మరోహిట్ సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement