ఆయుష్మాన్ ఖురానా
బాలీవుడ్ యువ హీరో ఆయుష్మాన్ ఖురానా అరుదైన గౌరవాన్ని పొందారు. ప్రఖ్యాత యూఎస్ మ్యాగజీన్ ‘టైమ్స్’ విడుదల చేసిన ప్రపంచ అత్యంత ప్రభావశీల వ్యక్తుల టాప్–100 జాబితాలో ఆయుష్మాన్ చోటు సంపాదించుకున్నాడు. ఢిల్లీలో బిగ్ ఎఫ్‌ఎమ్‌లో ఆర్జేగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయుష్మాన్ ఆ తర్వాత టీవీ యాంకర్‌గా పనిచేశారు. 2012లో వచ్చిన సూజిత్ సర్కార్ ‘విక్కీ డోనర్’తో బాలీవుడ్ బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించారు.
అలాగే ఆయుష్మాన్ నటించిన ‘అంధాదూన్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘ఆర్టికల్ –15, డ్రీమ్ గర్ల్, బాలా’ వంటి వినూత్న చిత్రాలతో వరుస హిట్లు అందుకుని బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు ఆయుష్మాన్ ఖురానా. ఇదిలా ఉంటే.. ‘టాప్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ది వరల్డ్’ జాబితాలో భారతదేశం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, సుందర్ పిచాయ్, రవీంద్రగుప్తా, బిల్కిస్ దాది తదితరులు కూడా ఉన్నారు. ‘‘ప్రతిభావంతులు ఉన్న ఈ జాబితాలో స్థానం సంపాదించుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు ఆయుష్మాన్ ఖురానా.
Comments
Please login to add a commentAdd a comment