ముంబై: బాలీవుడ్ నటుడి కుమార్తెను బెదిరించిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ప్రైవేట్ ఫోటోలు తన దగ్గర ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ దిగడంతో పాటు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశాడు. మొదట డబ్బులు ఇచ్చిన యువతి తరువాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని ముంబైలోని మలాద్ నివాసి కుమైల్ హనీఫ్ పఠానిగా గుర్తించారు.
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) లోని వివిధ సెక్షన్ల కింద, సమాచార సాంకేతిక చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలు చదువుకుంటున్నకాలేజీలోనే నిందితుడి సోదరి కూడా చదువుతున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు పర్సనల్ ఫోటోలు పెట్టి బెదిరించినట్లు నటుడి కుమార్తె తెలిపింది. ఇంకా తన దగ్గర ఫోటోలు ఉన్నట్లు చెప్పి ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంతో తల్లిదండ్రులకు విషయాన్నిచెప్పినట్లు బాధితురాలు తెలిపింది. నిందితుడికి రూ.20 వేల వరకు ఇచ్చినట్లు బాధితురాలు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment