మాయావతి బ్లాక్‌మెయిలర్
రూ. 50 కోట్లు డిమాండ్ చేశారు: సిద్దిఖీ
లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతి రూ.50 కోట్లు డిమాండ్ చేశారని ఆ పార్టీ బహిష్కృత నేత నసీముద్దీన్ సిద్దిఖీ ఆరోపించారు. మాయావతి ‘బ్లాక్‌మెయిలర్’ అని విమర్శించారు.
తగినన్ని ఆధారాలున్నాయని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోపణలకు ఆధారంగా.. మాయవతితో జరిపిన సంభాషణల ఆడియోను విలేకరుల సమావేశంలో వినిపించారు. తన వద్ద ఇంకా 150 ఆడియో సంభాషణలు ఉన్నాయని చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో ముస్లింలు బీఎస్పీకి ఓటేయనందుకు వారు నమ్మకద్రోహులంటూ మాయవతి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సిద్దిఖీ బ్లాక్ మెయిలింగ్‌తో కోట్లు సంపాదించారని తర్వాత మీడియా సమావేశంలో మాయావతి ఆరోపించారు.