టీవీ నటిని బ్లాక్ మెయిల్ చేసి దొరికిపోయాడు.. | Minor held for hacking TV actor's social media accounts, blackmail | Sakshi
Sakshi News home page

టీవీ నటిని బ్లాక్ మెయిల్ చేసి దొరికిపోయాడు..

Published Mon, Dec 28 2015 4:22 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

టీవీ నటిని బ్లాక్ మెయిల్ చేసి దొరికిపోయాడు.. - Sakshi

టీవీ నటిని బ్లాక్ మెయిల్ చేసి దొరికిపోయాడు..

ముంబై: వర్ధమాన  టీవీ నటి అశ్లీల ఫోటోలను చేజిక్కించుకొని, బ్లాక్మెయిల్ చేసిన  ఆకతాయిని పోలీసులు  అరెస్ట్ చేశారు.  ముంబైలో ఓ టీవీ నటిపై వేధింపులకు పాల్పడిన  బాలుడిని  బంగూర్ నగర్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం బుల్లితెరపై ఇప్పుడిప్పుడే రాణిస్తున్న ఓ నటిపై ముంబైలోని దహిసర్ ప్రాంతానికి చెందిన ఓ పదహారేళ్ల బాలుడు వేధింపులకు పాల్పడ్డాడు.

 

పలు టెలివిజన్ సీరియల్స్, సినిమాల్లో నటించిన సదరు నటి అశ్లీల ఫొటోలను చేజిక్కించుకున్న అతడిలో దుర్బుద్ధి మొదలైంది. వాటిని ఆమె వాట్సప్‌కు పంపి  బెదిరించం మొదలు పెట్టాడు.  ఫోటోలను  సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా ఉండాలంటే మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 5 లక్షలు  జమ చేయాలని బెదిరించాడు.

దీంతో భయపడిన సదరు నటి బంగూర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దహిసర్ తూర్పు ప్రాంతంలో  నిన్న ఉదయం అతడి ఆట కట్టించారు.  గతంలో కూడా ఇదే తరహాలోనే  మరో ముగ్గురు నటీమణులను కూడా ఇతగాడు వేధించాడని పోలీసుల విచారణలో తేలింది.

కాగా జార్ఖండ్‌కు చెందిన ఈ మైనర్ మధ్యలోనే చదువు ఆపేసి ఉద్యోగ నిమిత్తం ముంబైకు వచ్చాడని పోలీసులు తెలిపారు. గత ఆరు నెలలుగా తన స్నేహితునితో కలిసి నల్లాసోపారా ప్రాంతంలో నివసిస్తున్నాడని, సదరు నటి ఫోటోలను ఈ మెయిల్, ఇతర సోషల్ మీడియా సైట్ల నుంచే హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement