వైద్యురాలికి ఎస్‌ఐ వేధింపులు | Bengaluru doctor alleges harassment by former police partner, Files complaint | Sakshi
Sakshi News home page

వైద్యురాలికి ఎస్‌ఐ వేధింపులు

Nov 16 2024 8:33 AM | Updated on Nov 16 2024 8:42 AM

Bengaluru doctor alleges harassment by former police partner, Files complaint

దొడ్డబళ్లాపురం: యువ వైద్యురాలిని ప్రేమ పేరుతో లైంగికంగా వేధించిన పోలీస్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌పై బెంగళూరు బసవనగుడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడు ఇదే ఠాణాలో ఎస్సై రాజ్‌కుమార్‌. వివరాలు.. ఫేస్‌బుక్‌ ద్వారా 2020లో ఎస్సైకి ఒక వైద్యురాలు పరిచయమయింది. అప్పుడు ఆమె ఎంబీబీఎస్‌ చదువుతుండగా రాజ్‌కుమార్‌ పోలీస్‌ అకాడెమిలో ఎస్సై శిక్షణలో ఉన్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులు తరువాత ప్రేమికులు అయ్యారు.

ఈ క్రమంలో వైద్యురాలి నుంచి రాజ్‌కుమార్‌ రూ.1.71 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆమె డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్‌ చేసి నగ్నవీడియోలు, ఫోటోలు పంపించాలని బెదిరించేవాడు. కాల్‌ రికార్డ్స్‌ చేసుకుని బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. దీంతో విసిగిపోయిన వైద్యురాలు అతని దురాగతాలపై బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్‌ ఆదేశాల మేరకు  ఘరానా ఎస్సైపై కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement