కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి పై మహిళ ఆరోపణలు
బెంగళూరు ఠాణాలో ఫిర్యాదు
మాజీ ఎంపీ హెచ్‌డీ ప్రజ్వల్, తరువాత ఎమ్మెల్సీ హెచ్‌డీ సూరజ్‌లు లైంగిక దాడుల కేసుల్లో అరెస్టయ్యారు. ఆపై బెంగళూరులో సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న కూడా అత్యాచారం, హనీ ట్రాప్ కేసుల్లో కటకటాలు లెక్కిస్తున్నారు. ఈ జాబితా ఇంతటితో ఆగలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి కూడా చేరారు. న్యూడ్ కాల్స్, అత్యాచారం ఆరోపణలతో ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేయడం రాజకీయాల్లో కుదుపు ఏర్పడింది. ప్రజాప్రతినిధులు అంటే ఇలా కూడా ఉంటారా? అని ప్రజలు ముక్కున వేలేసుకునేలా కేసుల గోల సాగుతోంది.
దొడ్డబళ్లాపురం: ఇప్పటికే ముడా ఆరోపణలతో సతమతమవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుకు మరో తలనొప్పి ఎదురైంది. పార్టీ ఎమ్మెల్యేపై అత్యాచారం ఆరోపణలు గుప్పుమన్నాయి. ధార్వాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకరి్ణపై బెంగళూరు సంజయ్ నగర పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదయింది. కులకర్ణి పీఏ అర్జున్‌పై కూడా ఐటీ చట్టం, ఇతర అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి.
మహిళ ఫిర్యాదులో ఏముంది..
ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి తనపై అత్యాచారం చేయడంతోపాటు హింసించారని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు. 2022లో కులకరి్ణని తాను ఒక రైతు ద్వారా కలిసానని, ఎమ్మెల్యే రాత్రిపూట వీడియో కాల్ చేసి నగ్నంగా మారాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తరువాత బెంగళూరు హెబ్బాళలోని ఇంటికి రావాలని బెదిరించేవాడని, రాకపోతే రౌడీలను పంపించేవాడని, ఏప్రిల్ నెలలో తనను బెళగావికి పిలిపించుకుని అక్కడే తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది.
ఆగస్టు 24న పని నిమిత్తం బెంగళూరుకు వచ్చినప్పుడు తనను ఎయిర్‌పోర్టు సమీపంలోని నిర్జన ప్రదేశంలో కారులో అత్యాచారం చేసినట్టు పేర్కొంది. అక్టోబర్ 2న కూడా తనను ధర్మస్థలం తీసుకువెళ్లి అక్కడా అత్యాచారం చేశాడని తెలిపింది. ఈ తతంగంపై కొన్ని వీడియో కాల్స్ మంగళవారమే లీక్ కావడంతో కలకలం ఏర్పడింది.
బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: ఎమ్మెల్యే
ఈ ఆరోపణలపై వినయ్ కులకర్ణి స్పందిస్తూ మహిళ తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని, ప్రైవేటు టీవీ చానెల్ ఎండీ ఒకరు తనను రూ.2కోట్లు ఇవ్వాలని బెదిరించాడని సంజయ్‌నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment