
ఏకంగా రాజునే బ్లాక్ మెయిల్..
ఏకంగా రాజును బ్లాక్ మెయిల్ చేసి ఇద్దరు జర్నలిస్టులు కటకటాల పాలయ్యారు.
ప్యారిస్: రాజుపై ఓ పుస్తకం రాస్తున్నామని, దానిని ప్రచురించకుండా ఉండేందుకు తమకు భారీ మొత్తం సొమ్ము చెల్లించాలని ఏకంగా మొరాకో రాజును డిమాండ్ చేసిన ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మొరాకో రాజు మహ్మద్ 6 న్యాయవాది ఎరిక్ డుపాంట్ మొరెట్టి తెలియజేశారు.
ఎరిక్ లారెంట్, కేథరిన్ గ్రాసియెట్ అనే ఇద్దరు విలేకరులు రాజు కార్యకలాపాలు, పాలనతో కూడిన వివరాలతో పుస్తకాన్ని రాస్తున్నామని, దానిని ప్రచురించకుండా ఉండేందుకు తమకు దాదాపు 3.4 మిలియన్ డాలర్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే, వీరిద్దరిపై నాటకీయ పద్ధతిలో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన రాజు సంస్థాన కార్యాలయ అధికారులు తొలుస కేసు ఫైల్ చేసి అనంతరం అరెస్టు చేశారు.