బ్లాక్‘మెయిల్స్’పై తొలి వేటు
Published Tue, Oct 18 2016 12:23 AM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM
సాక్షి, గుంటూరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కొన్నేళ్లుగా ‘మెయిల్స్’ ద్వారా అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న వైద్య సిబ్బందిపై చర్యలకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ముందుగా ఓ వైద్యాధికారిపై చర్యలు తీసుకుని కిందిస్థాయి సిబ్బందికి హెచ్చరిక జారీ చేశారు. అందులో భాగంగా సోమవారం నుదురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అల్లాడి రాజేష్‌ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేశారు. అతడి స్థానంలో యడ్లపాడు మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మానాయక్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. గతంలోనే బ్లాక్‌మెయిల్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ డాక్టర్... జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎస్పీకి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో తనపై వేటు పడుతుందని ముందస్తుగా భావించి ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. వైద్య అధికారులకు హెల్త్ ప్రోగ్రామ్స్ నివేదికలు ఉన్నతాధికారులకు పంపించేందుకు ప్రత్యేకంగా ఇచ్చిన మెయిల్స్ నుంచి కొందరు బయటి వ్యక్తులకు సమాచారం పంపించి వైద్యాధికారులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ కరపత్రాలను సైతం ముద్రించారు. ఆరేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతుండటంతో గత నెలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులంతా మూకుమ్మడిగా కలెక్టర్, ఎస్పీలను కలిసి.. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మెయిల్స్ ద్వారా తమను ఇబ్బందులకు గురిచేస్తూ మనస్తాపం చెందేలా ప్రవర్తిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒకేసారి ఏడుగురు జిల్లా స్థాయి వైద్య అధికారులు, ఒక జోనల్ అధికారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ విషయంపై ప్రత్యేక దష్టి సారించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు తెలిసింది. ఆ నివేదిక ఆధారంగా తొలి విడతగా ఓ డాక్టర్‌ను సరెండర్ చేసిన ఉన్నతాధికారులు తదుపరి మిగతా వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
Advertisement
Advertisement