
రెండు పెళ్లిళ్లు.. పలువురితో రాసలీలలు
ఇంతకు ముందే రెండుసార్లు పెళ్లరుు్యంది.. కానీ వైవాహిక జీవి తంలో సరిపడా ఆనందం లేదని అడ్డదారులు
భర్త బాగోతం బయటపెట్టిన భార్య
అడ్డగుట్ట(సికింద్రాబాద్): ఇంతకు ముందే రెండుసార్లు పెళ్లరుు్యంది.. కానీ వైవాహిక జీవి తంలో సరిపడా ఆనందం లేదని అడ్డదారులు తొక్కుతూ అమ్మాయిలతో రాసలీలలకు దిగా డు. ఆ దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించి అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చూస్తూ ఆనందిస్తున్నా డు. తన రాసలీలకు భార్య అడ్డుగా ఉంటుందని తరచూ పుట్టింటికి పంపించేవాడు. భర్తపై అనుమానం వచ్చిన భార్య తన అన్నతో నిఘా పెట్టగా ఆదివారం రాత్రి ఓ అమ్మాయితో కులుకుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు ఆ కామాం ధుడు. తుకారాంగేట్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన జి. శ్రీకాంత్‌కు గౌలిగూడకు చెందిన మాధవితో 2012లో పెళ్లరుు్యంది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. వారికి ఇద్దరు కవలలు పుట్టారు.
వారు ప్రస్తుతం ఈస్ట్‌మారేడుపల్లిలోని నవీన్ సూపర్ మార్కెట్ వద్ద ఉంటున్నారు. శ్రీకాంత్ తుర్కపల్లిలోని సాయి లైఫ్ సెన్సైస్‌లో రీసెర్చ్ కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. పెళ్లైనప్పటి నుంచి శ్రీకాంత్ భార్యను తరచూ వేధింపులకు గురిచేస్తుండేవాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి కొందరు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్యను నిర్లక్ష ్యం చేస్తున్నాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య అతడిపై తన అన్నతో నిఘా పెట్టించింది. ఆదివారం శ్రీకాంత్ వేరే అమ్మాయితో ఓ ప్రైవేటు గదిలో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీకాంత్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని చూడగా అందులో పలువురు అమ్మాయిలతో శ్రీకాంత్ కలిసి దిగిన నగ్న చిత్రాలు కనిపించా యి. శ్రీకాంత్‌పై కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.