
మతం మారాలంటూ..పోర్న్ వీడియో
మతాంతర వివాహం చేసుకున్న ఓ మహిళకు అత్తింటివారి వేధింపులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
పాట్నా: మతాంతర వివాహం చేసుకున్న ఓ మహిళకు అత్తింటివారి వేధింపులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఓ మతానికి చెందిన ఆమెను తమ మతంలోకి మారాలని భర్త, అతని కుటుంబ సభ్యులు ఏకంగా పోర్న్ వీడియో తీసి బెరింపులకు పాల్పడ్డారు. ఈ సంఘటన పాట్నాలోని పుల్వారీలో చోటు చేసుకుంది.
వివరాలు..కోల్ కతాకు చెందిన ఓ మహిళ పాట్నాలో పుల్వారీలో నివాసం ఉంటున్న వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. భర్త, అతని కుటుంబసభ్యులు తనను ఒక నెల పాటూ వారి మతానికి చెందిన ప్రాంతంలో ఉండి.. వారి మతాచారాలను పాటించడం నేర్చుకొని, ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలని ఒత్తిడి చేసేవారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి ఒప్పుకోకపోవడంతో పోర్న్ వీడియోతీసి, మతం మారాలంటూ తనను టార్చర్ చేసేవారని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.