శృంగార తార బ్లాక్ మెయిలింగ్ | Cop among three held for blackmail, actor Nayana | Sakshi
Sakshi News home page

శృంగార తార బ్లాక్ మెయిలింగ్

Published Mon, Jun 23 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

శృంగార తార బ్లాక్ మెయిలింగ్

శృంగార తార బ్లాక్ మెయిలింగ్

ఒకప్పుడు శృంగార నటిగా ప్రకాశించి, అవకాశాలు ముఖం చాటేయడంతో ప్రముఖులకు వల వేసి బ్లాక్‌మెయిల్ చేస్తూ కోట్లు దండుకునే వ్యాపారం మొదలెట్టింది. విషయం పోలీసులకు తెలియడంతో చెన్నైలో ముఖం దాచుకుందని సమాచారం. వివరాల్లోకెళితే కన్నడ చిత్ర పరిశ్రమలో శృంగార నటిగా పేరొందిన  నయన కృష్ణకు తరువాత అవకాశం లేకపోవడంతో వేశ్య వృత్తిలోకి దిగిందని సమాచారం. ప్రముఖ వ్యక్తులతో సన్నిహితంగా మెలిగి తన సహచర బృందంతో దాన్ని వీడియో తీయించి వాటిని చూపించి కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోందట.
 
 అలా ఒక బెంగళూర్‌కు చెందిన డాక్టర్ నయన కృష్ణ మాయలోపడ్డారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వీడియో క్లిప్పింగ్‌లను చూపి కోటి రూపాయలు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడిందట. దీంతో దిమ్మ తిరిగి ఆ డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న బెంగళూర్ పోలీసులు ఈ బ్లాక్‌మెయిలింగ్ ముఠా కోసం వలపన్నారు. నయన కృష్ణ మోసానికి గురైన డాక్టర్ పోలీసుల సూచన ప్రకారం ఆమెకు ఫోన్ చేసి మొదట ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు.
 
 దీంతో ఆ డబ్బు తీసుకోవడానికి వచ్చిన నయన కృష్ణ ముఠాకు చెందిన ముగ్గురులో ఇద్దరిని పోలీసులు పట్టుకోగా మరొకడు తప్పించుకొని పారిపోయాడు. అతనితోపాటు నయన కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నయన కృష్ణ చెన్నైలో తలదాచుకుంటున్నట్లు పోలీసులకు సమచారం అందడంతో చైన్నై పోలీసుల సహాయంతో ఆమెను పట్టుకోవడానికి బెంగళూర్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసు వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement