బ్లాక్‌మెయిల్ కానిస్టేబుల్ సస్పెన్షన్
Published Wed, Sep 18 2013 2:23 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్ విద్యార్థినీని బెదిరించి ఆమె వద్ద నుంచి బంగారు గొలుసు స్వాహా చేసిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ జె.ప్రభాకరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను కానిస్టేబుల్ సీహెచ్.శ్రీకాంత్ (పీసీ నెంబరు 1395)కు అందజేశారు. సంఘటనపై సాక్షి దినపత్రిలో ఈ నెల 11వ తేదీన ‘బ్లాక్‌మెయిల్ కానిస్టేబుల్’ అన్న శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కానిస్టేబుల్ శ్రీనివాస్ నిర్వాకంపై విచారణ చేపట్టారు. డీఎస్పీ కేవీ శ్రీనివాసులు విచారణ చేసి నివేదికను ఎస్పీకి సమర్పించారు. కానిస్టేబుల్ శ్రీకాంత్ విద్యార్థినీని బ్లాక్‌మెయిల్ చేసి బెదిరింపులకు దిగటం, తన కోరిక తీర్చమని డిమాండ్ చేయటం, బంగారు గొలుసును స్వాహా చేసిన సంఘటనలు నిజమేనని రుజు వైంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. బ్లాక్‌మెయిల్ చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురికావటం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది
Advertisement