
నెల్లూరు(క్రైమ్): ప్రేమిస్తున్నానని నమ్మించి ఓ యువతికి బాదంపాలులో మత్తుమందు కలిపించి నగ్నచిత్రాలను తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన ఓ యువతి ఇంటర్మీడియట్ చదువుతుండగా అదే ప్రాంతానికి చెందిన పి.మోహన్‌కుమర్‌తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుందామని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో సుమారు ఏడాదిన్నిర క్రితం మోహన్ ఆమెను కారులో ఎక్కించుకుని నగరానికి దూరంగా తీసుకెళ్లాడు. తమ వెంట తెచ్చుకున్న తినుబండారాలు, బాదంపాలును ఇద్దరూ కలిసి తిన్నారు.
ఈ క్రమంలో మోహన్‌కుమార్ బాదంపాలులో ఆమెకు మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన ఆ యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లగానే ఆమెను వివస్త్రను చేసి నగ్నచిత్రాలను సెల్‌ఫోన్‌లో తీశాడు. కొద్దిసేపటికి ఆమె లేవడంతో ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లాడు. అప్పటినుంచి ఆ చిత్రాలను చూపించి యువతి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు. ఇటీవల లైంగికవాంచ తీర్చాలని లేకుంటే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని ఆమెను బెదిరించసాగాడు. అతని వేధింపులు తాళలేని బా«ధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. వారి సహకారంతో ఆదివారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment