ఫొటోలతో బ్లాక్ మెయిల్.. ఆపై లైంగిక దాడి! | Big Boss contestant Pooja Mishra alleges molestation, files police case | Sakshi
Sakshi News home page

ఫొటోలతో బ్లాక్ మెయిల్.. ఆపై లైంగిక దాడి!

Published Thu, Jun 16 2016 3:17 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

ఫొటోలతో బ్లాక్ మెయిల్.. ఆపై లైంగిక దాడి! - Sakshi

ఫొటోలతో బ్లాక్ మెయిల్.. ఆపై లైంగిక దాడి!

బిగ్ బాస్ సెలబ్రిటీ షో మాజీ కంటెస్టెంట్ పూజా మిశ్రా ఆందోళన చెందుతోంది. ముగ్గురు వ్యక్తులు తనను బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ రాజస్థాన్, జైపూర్ లో ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతవారం పూజా మిశ్రా ఫొటో షూట్ కోసం జైపూర్ వచ్చింది. అక్కడ ఓ హోటల్ లో స్టే చేసింది. ఆ సందర్భంగా తన వద్ద ఉన్న రూ.2 లక్షల నగదు చోరీ అయ్యాయని, అందుకు కారణం సెలూన్ ఓనర్ రితూ దేశ్వాల్ అని పేర్కొంది. ఫొటో షూట్ కోసం ప్రిపేర్ అవ్వాలని ఓ సెలూన్ కు వెళ్లగా దేశ్వాల్, ఈవెంట్ ఆర్గనైజర్ తన బిల్లు డబ్బులు మరింత ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో రెండు గంటల పాటు ఈవెంట్ ఆలస్యం చేశారని ఆరోపించింది.

హరీష్, మోసిన్, సుహాన్ అనే ముగ్గురు వ్యక్తులు ఫొటో షూట్ చేసిన ఫుటేజీ ఇవ్వడానికి చాలా ఎక్కువ మోతాదులో నగదు డిమాండ్ చేశారని, అందుకు తాను అంగీకరించలేదని చెప్పింది. ఈ క్రమంలో జూన్ 13న తాను తీసుకున్న ఆహారంలో డ్రగ్స్ కలిపారని, ఆ తర్వాత లైంగికదాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొంది.  ఐపీసీ సెక్షన్లు 376(రేప్), 384(బ్లాక్ మెయిల్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై సెలూన్ ఓనర్ రితూ దేశ్వాల్ ను సంప్రదించగా.. ఫొటో షూట్ కోసం ఇక్కడికి వచ్చిన పూజా మిశ్రా, పద్ధితిగా నడుచుకోలేదని.. స్టాఫ్ తో తన ఇష్టరీతిన  ప్రవర్తించిందని చెప్పాడు.

తన పర్మిషన్ లేకుండానే సెలూన్ నుంచి కొన్ని విలువైన వస్తువులు చోరీ చేసిందని ఆరోపించాడు. ఇదిలాఉండగా 2015 ఏప్రిల్ లో ఉదయ్ పూర్ లో కూడా లైంగిక దాడికి యత్నించారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫైవ్ స్టార్ హోటల్లో తాను తాగిన డ్రింక్ లో మత్తుమందు  కలిపారని, ఆ తర్వాత ఓ గుర్తుతెలియని వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించి హత్యాచారయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. పూజా మిశ్రాపై బెదిరింపులకు పాల్పడటంతో పాటు లైంగిక దాడికి యత్నించిన వారిపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నట్లు బాబు లాల్ బిష్నోయ్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement