యువతిపై లైంగిక దాడి | Sexual assault on a young woman | Sakshi
Sakshi News home page

యువతిపై లైంగిక దాడి

Published Sat, Aug 22 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

Sexual assault on a young woman

- వీడియో తీసి బ్లాక్ మెయిల్
 
పటమట : యువతిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం రామవరప్పాడులోని మల్లెమూడివారి వీధి లో మోహనరావు ఇంట్లో అద్దెకు ఉం టున్న యువతి(24) పటమటలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది. 2014 నవంబరు నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి యజమాని మూడవ కుమారుడు రాఘవేంద్రరావు ఇంట్లో అద్దెకు ఉంటున్న యువతిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే తన స్నేహితుడు వెంకటేష్ వీడియో తీసాడని, తాను చెప్పిన విధంగా చేయకపోతే ఆ వీడియో నెట్ లో పెడతానని బెదిరించి డిసెంబరు నుంచి తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరావు ఆ వీడియోను తన స్నేహితుల యిన నాని, హరికృష్ణ, రాజశేఖర్, సురేష్‌లకు పంపించాడు. అప్పటి నుంచి యువతికి రాఘవేంద్రరావు స్నేహితులు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు, లేకపోతే వారి కోరిక తీర్చాలని బెదిరించారు. దీంతో ఒకసారి కొంత నగదు ఇచ్చింది. మరలా ఫోన్‌లు చేసి డబ్బులు అడగడం ప్రా రంభించారు ఆ వేధింపులు భరించలేక యువతి రెండు రోజుల కిందట తన చెల్లెలకు జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తన స్నేహితులకు జరిగిన విషయం చెప్పడంతో వారు రాఘవేంద్రరావు సూర్యారావుపేటలో నిర్వహిస్తున్న షాపు వద్దకు వెళ్లి ప్రశ్నిం చారు.

వారిపై అతను ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు తండ్రి మోహనరావుకు షాపుపై యువకులను పంపించారని వివరించాడు. దీంతో తండ్రి మో హనరావు, కుటుంబ సభ్యులు కృష్ణకుమారి, వర, దుర్గలు యువతి ఇంటిపై గురువారం దాడి చేసి బాధితురాలి చెల్లెలిని, కుటుంబ సభ్యులను కొట్టా రు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన రాఘవేంద్రరావు, వీడియో తీసిన వెంకటేష్, స్నేహితులు నాని, హరికృష్ణ, రాజశేఖర్, సురేష్, ఇంటిపై దాడి చేసిన మోహనరావు, కృష్ణకుమారి, వర, దుర్గలపై కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement