విజయవాడ: చర్చి ఫాదర్ను బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలో మొత్తం తొమ్మిది మంది నిందితులు ఉన్నట్లు కమిషనర్ గౌతం కుమార్ వెల్లడించారు. ఇందులో ఓ మాజీ పాత్రికేయుడి ప్రమేయం సైతం ఉన్నట్లు గుర్తించామన్నారు. నిందితులు ఫాదర్ను బెదిరించి సుమారు రూ. 1.32 కోట్లను వసూలు చేశారని, బాధితుడు ఆస్తులు విక్రయించి మరీ ఈ ముఠాకు డబ్బులు ఇచ్చాడని ఆయన వెల్లడించారు.
కేసు ఇంకా దర్యాప్తులోనే ఉందని, మీడియా పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని కమిషనర్ స్పష్టం చేశారు. మత బోధకుడికి సంబంధించిన అశ్లీల చిత్రాలతో కూడిన పెన్‌డ్రైవ్ తమ వద్ద ఉందని నిందితులు బ్లాక్ బెయిల్ చేసినట్లు సమాచారం.