Comissioner
-
దేవాదాయ కమిషనర్ ఆదేశాలు బేఖాతర్ !
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై మౌనస్వామి దేవాలయం కూల్చివేత విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలను సైతం స్థానిక అధికారులు పట్టించుకోలేదు. దుర్గగుడిపై భవానీ మండపం, అన్నదాన భవనంతోపాటు మౌనముని గుడిని కూల్చివేయాలనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోయారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న నవదుర్గలను కలుపుతూ భవానీ మండపాన్ని నిర్మించారని, 1950 నుంచి 1980 వరకు మౌనముని కొండపై ఉండి దేవాలయ అభివృద్ధితోపాటు అన్నదానం చేశారని వివరిస్తూ టి.విజయకనకదుర్గ శ్రీనివాస్ అనే భక్తుడు దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధకు లేఖ రాశారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న వాటిని కాపాడాలని కోరారు. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్ జూన్ నెలలో మౌనస్వామి గుడి జోలికి వెళ్లవద్దని ఉత్తర్వులు జారీచేశారు. అప్పట్లో మౌనస్వామి ఆలయాన్ని కూల్చేందుకు దేవస్థానం అధికారులు సాహసించలేదు. స్వయంప్రతిపత్తి వచ్చిన వెంటనే.. దుర్గగుడికి స్వయంప్రతిపత్తి వచ్చిన వెంటనే ఈవోకు నిర్ణయాధికారులు వచ్చాయి. దీంతో కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ మౌనస్వామి గుడిని నేలమట్టం చేశారు. స్వయంప్రతిపత్తి వల్ల దేవాలయ ప్రతిష్ట పెరిగే పనులు చేయాలని, భక్తుల విశ్వాసాలను దెబ్బతీయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
బ్లాక్మెయిలర్లకు ఆస్తులమ్మి డబ్బిచ్చాడు
విజయవాడ: చర్చి ఫాదర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలో మొత్తం తొమ్మిది మంది నిందితులు ఉన్నట్లు కమిషనర్ గౌతం కుమార్ వెల్లడించారు. ఇందులో ఓ మాజీ పాత్రికేయుడి ప్రమేయం సైతం ఉన్నట్లు గుర్తించామన్నారు. నిందితులు ఫాదర్‌ను బెదిరించి సుమారు రూ. 1.32 కోట్లను వసూలు చేశారని, బాధితుడు ఆస్తులు విక్రయించి మరీ ఈ ముఠాకు డబ్బులు ఇచ్చాడని ఆయన వెల్లడించారు. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉందని, మీడియా పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని కమిషనర్ స్పష్టం చేశారు. మత బోధకుడికి సంబంధించిన అశ్లీల చిత్రాలతో కూడిన పెన్‌డ్రైవ్ తమ వద్ద ఉందని నిందితులు బ్లాక్ బెయిల్ చేసినట్లు సమాచారం. -
'రైతులను భయపెడితే చూస్తూ ఊరుకోం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణం కోసం రైతులనుంచి ఏపీ ప్రభుత్వం భూములు కోరిన నేపథ్యంలో విజయవాడలోని కృష్ణానదిలో రాజధాని ప్రాంత రైతులు శుక్రవారం వినూత్న నిరసనకు దిగారు. మోకళ్ల లోతు వరకూ నీళ్లలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రైతుల ఇళ్లు తీసుకుంటామని, నోటిఫై చేసిన ప్రతి సెంట్ భూమిని తీసుకుంటామని సీఆర్డీఏ కమిషనర్ అంటున్నారని ఆర్కే చెప్పారు. రోజురోజుకీ రైతులను సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండో పంట వేయొద్దని చెప్పే అధికారం సీఆర్డీఏ కమిషనర్‌కు ఎక్కడదంటూ ధ్వజమెత్తారు. ఆయన అధికారా? రాజకీయ నేతా? అంటూ ప్రశ్నించారు. రైతులను సీఆర్డీఏ కమిషనర్ భయపడితే తాము చూస్తూ ఊరుకోమంటూ ఆర్కే స్పష్టం చేశారు.