బీజేపీ బ్లాక్ మొయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది
Published Mon, May 9 2016 10:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
డెహ్రాడూన్: కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, బ్లాక్ మోయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఆరో్పించారు. హరీష్ తమతో లావాదేవీలు చేసిన వీడియోలను కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు టీవీ ఛానళ్లకు విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది.
డెహ్రాడూన్ లోని ప్రెస్ కాన్ఫరెన్స్ లో హరీష్ మాట్లాడుతూ.. నేను ఇప్పటి వరకు ఆవీడియోలు చూడలేదన్నారు. స్నేహంగా ఉంటూ ఎవరినైనా ఈజీగా మోసం చేయవచ్చునని తెలిపారు. ఇందంతా ముందస్తు ప్లానింగ్ ప్రకారం జరిగిందని ఆయన ఆరోపించారు. అవి నఖిలీ వీడియోలని మమ్మల్ని చులకన చేయడానికి బీజేపీ చేస్తున్న కుట్రగా ఆయన పేర్కొన్నారు. మేమేమన్నా దేశ ద్రోహులమా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో ఇదంతా భాగమని హరీష్ ఆరో్పించారు.
Advertisement