ప్రియురాలిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ | Woman raped in UP | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని వీడియో తీసి బ్లాక్ మెయిల్

Apr 12 2016 3:44 PM | Updated on Apr 6 2019 9:01 PM

ప్రియురాలిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ - Sakshi

ప్రియురాలిని వీడియో తీసి బ్లాక్ మెయిల్

ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు.

కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాన్ని వీడియా తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏడాదిన్నర క్రితం దీపేంద్ర నిరంజన్ అనే యువకుడు.. నిందితురాలికి మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వీడియో తీసి, ఈ విషయం బయటకు చెప్పవద్దంటూ ఆమెను బెదిరించాడు. అంతేగాక అతని బంధువు కల్లు పటేల్తో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడని, తరచూ ఫోన్లో వేధిస్తున్నాడని చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement