Lover raped
-
ప్రియురాలిని వీడియో తీసి బ్లాక్ మెయిల్
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాన్ని వీడియా తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏడాదిన్నర క్రితం దీపేంద్ర నిరంజన్ అనే యువకుడు.. నిందితురాలికి మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వీడియో తీసి, ఈ విషయం బయటకు చెప్పవద్దంటూ ఆమెను బెదిరించాడు. అంతేగాక అతని బంధువు కల్లు పటేల్‌తో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడని, తరచూ ఫోన్లో వేధిస్తున్నాడని చెప్పింది. -
స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం
లింగాలఘణపురం: తన స్నేహితురాలికి మద్యం తాగించి, మిత్రులతో కలసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ప్రియుడు. ఈ ఘటన వరంగల్ జిల్లా లింగాలఘణపురం మండలంలో మంగళవారం రాత్రి జరిగింది. డీఎస్పీ సురేందర్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలానికి చెందిన ఓ విద్యార్థిని స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇంటర్ ఒకేషనల్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. జనగామలో డీజే సౌండ్స్ సిస్టమ్‌లో పనిచేస్తున్న అలీంతో ఆమెకు మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. మంగళవారం స్టేషన్ఘన్ఫూర్కు వచ్చిన ఆ అమ్మాయి ప్రియుడు అలీంతో కలసి బైక్‌పై జనగామకు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి సమయంలో లింగాలఘణపురం రోడ్డులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అలీం తన ముగ్గురు మిత్రులకు ఫోన్ చేసి పిలిపించాడు. అందరూ కలసి మద్యం తాగారు. ఈ క్రమంలో అలీం తన ప్రియురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని మిత్ర బృందం అత్యాచారం చేసి వెళ్లిపోయారు. మద్యం మత్తులో ఉన్న ఆమెను అలీం జనగామ చౌరస్తాలో అర్ధరాత్రి 3.30 గంటల ప్రాంతంలో వదిలిపెట్టాడు. అక్కడ ఆమె లారీ ఎక్కి రఘునాథపల్లి వద్ద దిగింది. రోడ్డుపై విద్యార్థిని ఒంటరిగా వెళుతుండగా రఘునాథపల్లి ఎస్సైతో కలిసి పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై వెంకటేశ్వర్రావు గమనించారు. ఆమెను జనగామకు తీసుకొచ్చి విచారించగా జరిగిన విషయం వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బుధవారం తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. -
ప్రేమికుడిపై దాడి.. ప్రియురాలిపై అత్యాచారం
హైదరాబాద్: హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమికుల ఫోటోలు తీసి ప్రియురాలిపై దుండగులు అత్యాచారం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ప్రేమికులు ఫిర్యాదుతో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సన్నిహితంగా ఉన్న జంటను సెల్కెమెరాలో దుండగులు బంధించారు. కెమెరాతో తీసిన దృశ్యాలను బయటపెడతామంటూ జంటను బెదిరించారు. అదే సమయంలో ప్రేమికుడిపై దాడి చేసి, యువతిపై అత్యాచారం చేశారు. దాంతో బాధితురాలు తమపై దాడిచేసి, అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.