స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం | lover raped his lover with friends | Sakshi
Sakshi News home page

స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం

Published Wed, Aug 5 2015 9:22 PM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం

స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం

లింగాలఘణపురం: తన స్నేహితురాలికి మద్యం తాగించి, మిత్రులతో కలసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ప్రియుడు. ఈ ఘటన వరంగల్ జిల్లా లింగాలఘణపురం మండలంలో మంగళవారం రాత్రి జరిగింది. డీఎస్పీ సురేందర్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలానికి చెందిన ఓ విద్యార్థిని స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇంటర్ ఒకేషనల్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. జనగామలో డీజే సౌండ్స్ సిస్టమ్‌లో పనిచేస్తున్న అలీంతో ఆమెకు మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. మంగళవారం స్టేషన్‌ఘన్‌ఫూర్‌కు వచ్చిన ఆ అమ్మాయి ప్రియుడు అలీంతో కలసి బైక్‌పై జనగామకు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి సమయంలో లింగాలఘణపురం రోడ్డులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అలీం తన ముగ్గురు మిత్రులకు ఫోన్ చేసి పిలిపించాడు. అందరూ కలసి మద్యం తాగారు.


ఈ క్రమంలో అలీం తన ప్రియురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని మిత్ర బృందం అత్యాచారం చేసి వెళ్లిపోయారు. మద్యం మత్తులో ఉన్న ఆమెను అలీం జనగామ చౌరస్తాలో అర్ధరాత్రి 3.30 గంటల ప్రాంతంలో వదిలిపెట్టాడు. అక్కడ ఆమె లారీ ఎక్కి రఘునాథపల్లి వద్ద దిగింది. రోడ్డుపై విద్యార్థిని ఒంటరిగా వెళుతుండగా రఘునాథపల్లి ఎస్సైతో కలిసి పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై వెంకటేశ్వర్‌రావు గమనించారు. ఆమెను జనగామకు తీసుకొచ్చి విచారించగా జరిగిన విషయం వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బుధవారం తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement