వాషింగ్టన్: భారత్ సంతతికి చెందిన విద్యార్థి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ప్రసిద్ధ పుర్‌డ్యూ యూనివర్సిటీ హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. హత్యకు పాల్పడింది రూమ్ మేటే. కొరియాకు చెందిన అతడు.. తనను మృతుడు బ్లాక్‌మెయిల్ చేయడం వల్లే ఈ చర్యకు పాల్పడినట్లు అంగీకరించాడు.
మృతుడు వరుణ్ మనీశ్ ఛెడా(20) ఇండియానా పోలీస్‌కు చెందినవాడు. గత బుధవారం యూనివర్సిటీ మెక్‌కుచియాన్ హాల్‌లో ఉన్నప్పుడు హత్యకు గురయ్యాడు. నిందితుడు జిన్ మిన్ జిమ్మీ షా(22).. సెబైర్ సెక్యూరీటీ కోర్సు చేస్తున్నాడు.
షాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా నేరం అంగీకరించాడు. మృతుడి తల్లిదండ్రలకు క్షమాపణలు చెప్పాడు. తనను బ్లాక్‌మెయిల్ చేసినందుకే హత్య చేసినట్లు పేర్కొన్నాడు. అయితే ఏ విషయం గురించి అని మాత్రం వెల్లడించలేదు.
వరుణ్‍ను రూంలోనే పదునైన కత్తితో జిమ్మీ పొడిచినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతడే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. హత్య అనంతరం ఆ గది రక్తపుమరకలతో నిండిపోయింది. అక్కడే ఉన్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్‌ను కిడ్నాప్ చేసిన రష్యా!
Comments
Please login to add a commentAdd a comment