purdu University
-
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికాలోని సిన్సినాటిలో భారతీయ విద్యార్థి ఒకరు చనిపోయారు. అతడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇండియానా రాష్ట్రంలోని పర్డూ యూనివర్సిటీలో చదువుకుంటున్న నీల్ ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. ఇతడు మృతి చెందినట్లు పోలీసులు సోమవారం ధ్రువీకరించారు. వారం రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన ఇది రెండోది కావడం గమనార్హం. మూడు రోజుల క్రితం ఎంబీఏ చదువుకుంటున్న వివేక్ సైనీ(25) అనే భారతీయ విద్యార్థిని జూలియన్ ఫాక్నర్ అనే డ్రగ్స్ బానిస సుత్తితో కొట్టి దారుణంగా పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. -
అమెరికాలో భారత సంతతి విద్యార్థి హత్య
వాషింగ్టన్: భారత్ సంతతికి చెందిన విద్యార్థి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ప్రసిద్ధ పుర్డ్యూ యూనివర్సిటీ హాస్టల్లో ఈ ఘటన జరిగింది. హత్యకు పాల్పడింది రూమ్ మేటే. కొరియాకు చెందిన అతడు.. తనను మృతుడు బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఈ చర్యకు పాల్పడినట్లు అంగీకరించాడు. మృతుడు వరుణ్ మనీశ్ ఛెడా(20) ఇండియానా పోలీస్‌కు చెందినవాడు. గత బుధవారం యూనివర్సిటీ మెక్కుచియాన్ హాల్లో ఉన్నప్పుడు హత్యకు గురయ్యాడు. నిందితుడు జిన్ మిన్ జిమ్మీ షా(22).. సెబైర్ సెక్యూరీటీ కోర్సు చేస్తున్నాడు. షాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా నేరం అంగీకరించాడు. మృతుడి తల్లిదండ్రలకు క్షమాపణలు చెప్పాడు. తనను బ్లాక్మెయిల్ చేసినందుకే హత్య చేసినట్లు పేర్కొన్నాడు. అయితే ఏ విషయం గురించి అని మాత్రం వెల్లడించలేదు. వరుణ్‌ను రూంలోనే పదునైన కత్తితో జిమ్మీ పొడిచినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతడే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. హత్య అనంతరం ఆ గది రక్తపుమరకలతో నిండిపోయింది. అక్కడే ఉన్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్‌ను కిడ్నాప్ చేసిన రష్యా! -
స్మార్ట్ ఫోన్ డేటా తిరిగి రాబట్టే సాధనం
వాషింగ్టన్: స్మార్ట్ ఫోన్లోని సమాచారాన్ని తిరిగి రాబట్టే సరికొత్త కిటుకును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తద్వారా స్మార్ట్‌ఫోన్ నేరాల దర్యాప్తు మరింత సులువు కానుందని చెబుతున్నారు. శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమాజంలో అందరూ స్మార్ట్ఫోన్లలో తమ సమాచారాన్ని దాచుకుంటున్నారు. అనాదిగా జరుగుతున్న ఈ తరహా నేరాల్లో వీటిని ఆధారాలుగా సేకరించడం కూడా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రెట్రోస్కోపీగా పిలిచే సరికొత్త సాధనం ఇందుకు దోహదపడనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెట్రోస్కోపీ.. స్మార్ట్‌ఫోన్ హార్డ్ డిస్క్‌పై దృష్టి పెడుతుందని, ఫోన్ స్విచ్ఆఫ్ ఆయిపోయినప్పటికీ ఈ కిటుకు ద్వారా డివైస్ ర్యామ్ అస్థిర సామర్థ్యాన్ని అలాగే పట్టి ఉంచుతుందని పేర్కొంటున్నారు. రెట్రోస్కోపీ ద్వారా సైబర్ నేరాల దర్యాప్తులో భాగంగా అన్ని యాప్స్ నుంచి అత్యంత తాజా సమాచారమైన అస్థిర సామర్థ్యాన్ని అందజేస్తుందని తాము వాదిస్తామని పుర్డూ యూనివర్సిటీ ప్రొఫెసర్, పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న డొంగ్యాన్ క్చ్యూ తెలిపారు.