'లక్షలు ఇవ్వకుంటే వ్యతిరేక ప్రసారాలు చేస్తాం' | 5 journalists jailed in China for blackmailing govt officials | Sakshi
Sakshi News home page

'లక్షలు ఇవ్వకుంటే వ్యతిరేక ప్రసారాలు చేస్తాం'

Published Mon, May 16 2016 7:56 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

'లక్షలు ఇవ్వకుంటే వ్యతిరేక ప్రసారాలు చేస్తాం'

'లక్షలు ఇవ్వకుంటే వ్యతిరేక ప్రసారాలు చేస్తాం'

బీజింగ్: చైనాలో ఓ వార్తా పత్రికకు సంబంధించిన ఐదుగురు జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అక్కడి కోర్టు పన్నేండేళ్లపాటు శిక్షను విధిస్తూ వారిని కటకటాల్లోకి పంపించింది. ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసే ప్రయత్నాలు చేసినందుకు వారికి ఈ శిక్ష వేశారు.

సెంట్రల్ హునాన్ ప్రావిన్స్ లోని మోడరలన్ కంజ్యూమర్ న్యూస్ చానెల్ లో జాంగ్ హునిరి అనే ఉపాధ్యక్షుడు, మరో నలుగురు సహ ఉద్యోగులు ఉన్నారు. వారు ఓ పన్నెండు మంది ప్రభుత్వ ఉద్యోగులను దాదాపు లక్షా పాతికవేల డాలర్లు ఇవ్వాలని లేదంటే వారికి సంబంధించి వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ ఆరోపణల కిందట అరెస్టు చేసిన పోలీసులు వారని కోర్టులో ప్రవేశ పెట్టగా పన్నేండేళ్ల జైలు శిక్ష పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement