లైంగిక క్రీడల వీడియోతో బ్లాక్ మెయిల్ | Actress Nayana krishna Blackmails with sex video | Sakshi
Sakshi News home page

లైంగిక క్రీడల వీడియోతో బ్లాక్ మెయిల్

Published Thu, Jul 3 2014 2:37 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

లైంగిక క్రీడల వీడియోతో బ్లాక్ మెయిల్ - Sakshi

లైంగిక క్రీడల వీడియోతో బ్లాక్ మెయిల్

  • నటి నయనా కృష్ణపై మరో బాధితుడి కేసు  
  •  వైద్యుడి ఫిర్యాదుతో వెలుగులోకి వస్తున్న బాధితులు
  •  దర్యాప్తు చేస్తున్న సీసీబీ
  •  12 రోజులుగా నటి కోసం గాలింపు
  • బెంగళూరు: లైంగిక క్రీడలో ఉన్న సమయంలో వీడియో తీసి..  వాటితో బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ కన్నడ నటి నయనా కృష్ణపై తాజాగా మరో బాధితుడు స్థానిక విల్సన్ గార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీ సులు తెలిపిన సమాచారం మేరకు.. నగరంలో నివాసముంటున్న కృష్ణప్ప 2010లో లైంగిక క్రీడలో ఉన్న సమయంలో నటి నయనా కృష్ణ, ఆమె స్నేహితులు వీడియో తీశారు. అనంతరం ఆ క్లిప్పింగులు చూపి నటి నయనా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. భారీగా డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు విల్సన్ గార్డెన్ పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు.
     
    వైద్యుడి ధైర్యంతో ముందుకొస్తున్న బాధితులు
    చాళుక్య సర్కిల్‌లో ఉన్న ఒక వైద్యుడు కొన్ని రోజుల క్రితం లైంగిక క్రీడలో ఉన్న సమయంలో నటి నయనా కృష్ణ, ఆమె స్నేహితులు మేఘనా, రిహానా తదితరులు వీడియో తీశారు. తర్వాత వీరితో పాటు కానిస్టేబుల్ మల్లేష్, ప్రైవేటు టీవీ చానెల్‌లో పని చేస్తున్న హేమంత్ కుమార్, సునీల్, జిమ్ సెంటర్ నిర్వహకుడు రఘు ఆ క్లిప్పింగ్‌లు చూపి వైద్యుడ్ని బ్లాక్ మెయిల్ చేశారు. రూ. లక్షను వసూలు చేసి.. మరో రూ. 15 లక్షలను సిద్ధం చేసుకోవాలని డిమాండ్ చేసి వెళ్లిపోయారు. దీంతో ఆ వైద్యుడు రెండు వారాల క్రితం సీసీబీ పోలీసులను ఆశ్రయించాడు. 12 రోజుల క్రితం నగదు తీసుకోడానికి ఆ వైద్యుడి వద్దకు వచ్చిన హేమంత్ కుమార్, సునీల్‌ను ఆ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి మిగి లిన నిందితుల కోసం గాలిస్తున్నారు.  
     
    నటి నయనా కృష్ణ కోసం గాలిస్తున్నాం.. : పోలీసులు
    నటి నయనా కృష్ణ  కోసం తాము 12 రోజులుగా గాలిస్తున్నామని సీసీబీ పోలీసులు తెలిపారు. నగర పోలీసు అధికారులు ఆదేశాల మేరకు తామీ కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.  ఈ కేసు విషయమై వారు బుధవారం మాట్లాడుతూ.. ‘ నటి నయనా కృష్ణ ఇలా చాలా మందిని బ్లాక్‌మెయిల్ చేస్తోంది. బెదిరించి లక్షలాది రూపాయలను వసూలు చేస్తోంది.

    అయితే పరువు పోతుందని, సినీ రంగానికి చెందిన ఆమెకు ప్రముఖులతో పరిచయాలు ఉండటంతో ఆమెపై ఫిర్యాదుకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. అయితే రెండు వారాల క్రితం వైద్యుడు ధైర్యంగా ముందుకు వచ్చి..   ఫిర్యాదు చేశాడు. దీంతో మేం మొట్టమొదటి సారిగా ఆమెపై కేసు నమోదైంది. దీంతో అప్పటి నుంచి మేం ఆమె, ఆమె స్నేహితుల కోసం గాలిస్తున్నాం. ఈ విషయం తెలుసుకొని తాజా మరో బాధితుడు ముందుకు రావడం విశేషం. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తాం ’ అని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement