తప్పని తెలిసినా చేశారు.. సస్పెండ్‌ అయ్యారు | DHMO suspended Three Medical Staff Members For Doing Tik-Tok Video In Karimnagar | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ చేసినందుకు వైద్యసిబ్బంది సస్పెండ్‌

Published Sun, Jul 28 2019 9:08 AM | Last Updated on Sun, Jul 28 2019 11:07 AM

DHMO suspended Three Medical Staff Members For Doing Tik-Tok Video In Karimnagar  - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని డీఎంహెచ్‌ఓ రాంమనోహర్‌రావు శనివారం సస్పెండ్‌ చేశారు. ‘వైరల్‌ అయిన ఉద్యోగుల టిక్‌టాక్‌ ’ అని శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. సీనియర్‌ అసిస్టెంట్లు సమత, దివ్య, ల్యాబ్‌ అటెండర్‌ విజయలక్ష్మికి శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. టిక్‌టాక్‌ వీడియో విషయంపై తీవ్రంగా స్పందిం చిన కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశాల మేరకు వారిని డీఎంహెచ్‌ఓ  సస్పెండ్‌ చేశారు. ఈ సస్పెన్షన్‌పై అధికారులు విచారణ చేపట్టి నివేదిక అందించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement