కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : అవినీతి ఆరోపణలపై ఇటీవల సస్పెన్షన్‌కు గురైన క రీంనగర్ మహిళా పోలీస్‌స్టేష న్ ఎస్సై శ్రీలతపై అకస్మాత్తు గా సస్పెన్షన్ ఎత్తివేశారు. స స్పెండ్ అయినా 40 రోజుల కే.. ఎస్పీ బదిలీ అయి రిలీవ్ కావడానికి ఒకరోజు ముందు గా ఎత్తివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కిందిస్థాయి సిబ్బంది చిన్న తప్పు చేసినా చర్యలు తీసుకుని నెలల తరబడి సస్పెన్షన్‌లో ఉంచే ఉన్నతాధికారులు.. పలు అవినీతి ఆరోపణలున్న ఎస్సై సస్పెన్షన్‌ను కేవలం 40 రోజుల్లో ఎత్తివేయడంపై పోలీస్ సిబ్బంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగిత్యాల డివిజన్‌లో ఉద్యోగంలో చేరిన కొద్దికాలానికి అవినీతి ఆరోపణలపై ఓ ఎస్సైని సస్పెండ్ చేసి చాలా నెలలపాటు ఎత్తివేయలేదు. అదే శ్రీలత విషయంలో విచారణ పూర్తి కాకుండానే, బాధితురాలికి న్యాయం చేయకుండానే ఎత్తివేశారు. బుధవారం ఉదయం ఎస్పీ రవీందర్‌ను కలిసిన ఎస్సైపై సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు సాయంత్రంలోపు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బాధితురాలికి అన్యాయం
కరీంనగర్ శర్మనగర్‌కు చెందిన కంది సుజాతారెడ్డికి చైతన్యపురికాలనీకి చెందిన కామారెడ్డి జైపాల్‌రెడ్డితో వివాహమైంది. భర్త వేధించడంతో సుజాతారెడ్డి మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్సై శ్రీలతను సంప్రదించింది. ఆగస్టు 4న ఫిర్యాదు చేసింది. ఇద్దరి మధ్య విడాకులు ఖరారు చేసిన ఎస్సైకి సుజాతారెడ్డి మామ రూ.ఐదు లక్షలు ముట్టజెప్పాడు. వాటిని బాధితురాలికి అందించాల్సిన ఎస్సై రూ.2.90లక్షలు మాత్రమే ఇచ్చి మిగతావి అడిగితే బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొంటూ సుజాతారెడ్డి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టగా సెప్టెంబర్ 20న ఎస్సై శ్రీలతను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఇప్పటివరకు బాధితురాలు సుజాతారెడ్డికి మాత్రం డబ్బులు దక్కలేదు. మరోవైపు భర్త దూరమయ్యాడు. ఎస్పీగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన శివకుమార్ అయినా న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది.
ఎస్సై శ్రీలతపై సస్పెన్షన్ ఎత్తివేత
Published Fri, Nov 1 2013 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM
Advertisement