సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలను చివరివరకూ నిలబెట్టుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల పెట్టుబడులజోష్, దేశీయ ఇన్వెస్టర్‌ల కొనుగోళ్ల మద్దతుతో... సెన్సెక్స్ ఒక దశలో 507 పాయింట్లు లాభపడింది. చివరికి సెన్సెక్స్ 481 37535 వద్ద, నిఫ్టీ 133 11301 వద్ద ముగిశాయి. అన్ని సెక్టార్లు లాభాల దౌడు తీశాయి. ముఖ్యంగా బ్యాంకు నిఫ్టీ కొనుగోళ్ల జోరుతో బ్యాంక్ ఆల్ టైం హై రికార్డును నమోదు చేసింది.
దాదాపు అన్ని సెక్టార్లు పాజిటివ్‌గానే ముగియడం విశేషం. యాక్సిస బ్యాంకు, ఐసీఐసీఐబ్యాంకు, టైటన్, ఆర్‌ఐఎల్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. భారతి ఎయిర్‌టెల్, ఎల్ అండ్టీ, సన్ పార్మ, అదానీ పోర్ట్స్ టాప్ విన్నర్స్‌గా నిలవగా, భారతి ఇన్‌ఫ్రాటెల్, హిందుస్తాన్ పెట్రోలియం, జెఎస్ డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీటీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment