నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: స్వార్థం కోసం రాష్ట్రాన్ని రెండుగా విభజించేందుకు సోనియాగాంధీ చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని, లేదంటే సీమాంధ్ర సత్తా ఏంటో చూపుతామని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం ఆ పార్టీ నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ మనుగడ కనుమరుగు అవుతోందన్న భయంతోనే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం పాల్పడిందని ఆరోపించారు. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానానికి భయపడి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దొంగ రాజీనామాలతో మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.
ఆనం సోదరులారా
బయటకు రండి
‘రాష్ట్ర మంత్రి, రూరల్ ఎమ్మెల్యే ఆనం సోదరులు ఎక్కడ దాక్కున్నారో బాహ్య ప్రపంచంలోకి రండి. మీ ఇంటిముందుకొచ్చాం. దొంగ రాజీనామాలు చేసి బొత్సకు, భానుశ్రీకి ఇవ్వడం కాదు. దమ్ము, ధైర్యం ఉంటే స్పీకర్‌కు ఇచ్చి ఆమోదింప చేసుకుని సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ప్రజా ఉద్యమంలో నేరుగా పాల్గొనండి’ అని కోటంరెడ్డి, అనిల్ సవాల్ విసిరారు.
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏం పాపం చేశారని ఆయన విగ్రహాలపై చెయ్యి వేయాలని అనుకుంటున్నారు?. మూడు పర్యాయాలు నిన్ను ఎమ్మెల్యేగా చేశారనా? మీ తమ్ముడిని మంత్రి చేశారనా? మరో ఇద్దరు తమ్ముళ్లకు కాంట్రాక్టు పనులు కట్టబెట్టారనా? లేక భానుశ్రీని మేయర్ చేసినందుకా? వైఎస్సార్ విగ్రహాలను పగులకొట్టండని పిలుపునిస్తారని ఆనం వివేకానందరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఒక్కసారి వైఎస్సార్ విగ్రహాలపై చెయ్యి వేసి చూడండి.. ఏం జరుగుతుందోనని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు భరోసా కల్పిస్తున్న సమయంలో ఆయన్ను జైల్లో పెట్టించి కాంగ్రెస్ నాయకులు నాటకాలు అడుతున్నారన్నారు. ఈ నాటకాలు మరెంతో కాలం సాగవన్నారు. మహా అయితే మరో నాలుగు నెలల పాటు కొనసాగిస్తారేమో అని అన్నారు. ఆ తర్వాత తమ యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. అప్పుడు నీవు ఏమి మాట్లాడినా, ఏం చేసినా ఎవరూ పట్టించుకునే వారే ఉండరని ఆనం వివేకానుద్దేశించి కోటంరెడ్డి హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ముప్పసాని శ్రీనివాసులు, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ఎస్‌కే సుభాన్, షేక్ మాబు, లెక్కల వెంకారెడ్డి, ఆర్.జెస్సీ, సంక్రాంతి కల్యాణ్‌రెడ్డి, మునీర్‌సిద్ధిక్, దార్ల వెంకటేశ్వర్లు, ఎ.బాలకోటేశ్వరరావు, ఎండీ ఖలీల్‌అహ్మద్, ఎస్‌ఆర్ ఇంతియాజ్, కూకటి ప్రసాద్. జాఫర్‌మోహిద్దీన్, ఫజల్‌మన్నడు, దండే లక్ష్మిరెడ్డి, టి.రఘురామిరెడ్డి, ముప్పాల శేషుగౌడ్, కాకుటూరు విజయభాస్కర్‌రెడ్డి, గంధం సుధీర్‌బాబు, రజిని, సుభాషిణి, మీనమ్మ, శ్రావణ్‌కుమార్, హరిప్రసాద్‌నాయుడు, సత్య, అఖిల్, బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, నర్సింహముదిరాజ్, బత్తల వెంకటేశ్వర్లు, పట్రంగి అజయ్, చేజర్ల మహేష్‌బాబు, ప్రశాంత్, కిరణ్, నరేష్, అజీమ్, కారుదుంప దశరథరామయ్యలతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు వేలాది మంది పాల్గొన్నారు.
విభజిస్తే ఊరుకోం
Published Wed, Aug 7 2013 5:03 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement