soniyagandhi
-
లౌకికత్వం కోసం పోరాడారు
న్యూఢిల్లీ: ప్రజలను, దేశాన్ని కులమతాల పేరుతో విభజించాలనుకున్న వారికి వ్యతిరేకంగా, లౌకికవాదం కోసం దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పోరాడారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఇందిర శత జయంతి సందర్భంగా ఆమె సాధించిన విజయాలు, జీవన విధానంపై ఆదివారం ‘ఎ లైఫ్ ఆఫ్ కరేజ్’ పేరుతో ఢిల్లీలో చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సోనియా మాట్లాడుతూ ‘ఇందిరను కొందరు ఉక్కు మహిళగా అభివర్ణించడాన్ని నేను విన్నాను. ‘ఉక్కు’ అనేది ఆమె వ్యక్తిత్వంలో ఒక భాగం మాత్రమే. మానవత్వం, ఉదారత అనేవి ఆమెకున్న అనేక సద్గుణాలలో కొన్ని’ అని పేర్కొన్నారు. . ప్రముఖుల నివాళి... ఇందిర జయంతి సందర్భంగా ఆదివారం ప్రముఖులు నివాళులర్పించారు. ‘జయంతి సందర్భంగా ఇందిరా గాంధీని జాతి స్మరిస్తోంది’ అని రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఓ ట్వీట్‌తో ఇందిరకు నివాళి అర్పించారు. పార్లమెంటు సెంట్రల్ హాలులోనూ లోక్‌సభ స్పీకర్ మహాజన్, బీజేపీ నేత ఆడ్వాణీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్æ తదితరులు నివాళులర్పించారు. ఇందిర సమాధి ‘శక్తి స్థల్’ వద్ద ప్రణబ్, మన్మోహన్, రాహుల్‌గాంధీ పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళి అర్పించారు. ఇందిర దేశానికి అమ్మ అని బీజేపీ ఎంపీ, ఇందిర మనవడు వరుణ్ గాంధీ శ్లాఘించారు. మన్మోహన్‌కు శాంతి బహుమతి... ఈ ఏడాదికి ‘ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి’ బహుమతిని మాజీ ప్రధా ని మన్మోహన్ అందుకోనున్నారు. 2004 –14 మధ్య దేశాభివృద్ధికి కృషి చేసినందుకుగాను ఆయనను ఈ బహుమతికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. -
‘తెహల్కా’లో జోక్యం చేసుకోండి
-
‘తెహల్కా’లో జోక్యం చేసుకోండి
న్యూఢిల్లీ: తెహెల్కా మ్యాగజైన్ ఫైనాన్సియర్స్‌పై విచారణలో జోక్యం చేసుకోవాలని 2004లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. తెహెల్కా పెట్టుబడిదారులపై రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు అనుసరిస్తున్న వైఖరి అన్యాయంగా ఉందని, ఈ అంశాన్ని పరిష్కరించాలని లేఖలో సోనియా కోరారు. తెహెల్కా.కామ్ ప్రధాన పెట్టుబడిదారైన ఫస్ట్ గ్లోబల్ డైరెక్టర్ పంపిన వివరాల్ని పరిశీలించాలని అప్పట్లో నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా కేబినెట్ మంత్రి హోదాలో సోనియా కోరారు. 4 రోజులకు యూపీఏ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేసింది. 6 రోజులకు ఫస్ట్ గ్లోబల్‌పై కేసును ఉపసంహరించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సోనియా గాంధీ లేఖపై చిదంబరం స్పందిస్తూ.. ‘ఆ లేఖను పరిశీలించిన విషయం వాస్తవం. సోనియా లేఖకు తాను ఇచ్చిన సమాధానాన్ని కేంద్రం బయటపెట్టాలి. రెండింటిని కలిపి చదివితే స్పష్టత వస్తుంది’ అని వివరణ ఇచ్చారు. అప్పట్లో తెహెల్కా పత్రిక బహిర్గతం చేసిన రక్షణ ఒప్పందాల అవినీతికి బాధ్యత వహిస్తూ వాజ్‌పేయ్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ రాజీనామా చేశారు. డబ్బులు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ను అనంతరం కోర్టు దోషిగా నిర్ధారించింది. అత్యాచారం కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న తరుణ్ తేజ్‌పాల్ అప్పట్లో తెహెల్కా ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ అవినీతి వెలుగులోకి వచ్చాక.. ఫస్ట్ గ్లోబల్ ప్రమోటర్లు దెవినా మెహ్ర, శంకర్ శర్మలపై వివిధ దర్యాప్తు సంస్థలు పలు కేసులు నమోదు చేశాయి. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చాక మెహ్ర, శర్మలు సోనియాకు లేఖ రాస్తూ దర్యాప్తు సంస్థల వేధింపులు కొనసాగుతున్నాయని, పరిష్కరించాలని కోరారు. -
కాంగ్రెస్ వల్లే రాష్ట్రం అగ్నిగుండమైంది
జంగారెడ్డిగూడెం రూరల్/ ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ :మహనీయుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ముక్కలు చేయాలని నిర్ణయించి అగ్నిగుండంలా మార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర సాధనకై, పదవులు పట్టుకుని వేలాడుతున్న కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలగాలని కోరుతూ జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం వరకు మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన కనువిప్పు పాదయాత్రను ఆయన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఈ పాదయాత్రతో ఢిల్లీ పెద్దలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కనువిప్పు కలగాలన్నారు. ఆసుపత్రిలో ఉన్న జగన్మోహన్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం, పోలీసులు గోప్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మద్దాల రాజేష్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రకు తెలుగు ప్రజల ఆత్మవంచన యాత్రగా పేరుపెట్టి ప్రారంభించాలన్నారు. బస్సుయాత్రతో జనాల్లోకి వస్తే సీమాంధ్ర ప్రజలు రాళ్లతో తరిమికొడతారన్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామగ్రామానా సమైక్యవాదులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు మద్దతు తెలిపారు. 500 మంది కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాస్కులను ధరించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. తొలుత జంగారెడ్డిగూడెం గంగానమ్మ గుడి సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి బాలరాజు, రాజేష్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్ర జంగారెడ్డిగూడెం, దేవులపల్లి, కామవరపుకోట తాడిచర్ల మీదుగా 28 కిలోమీటర్లు ప్రయాణించి ద్వారకాతిరుమల చేరింది. చినవెంకన్న ఆలయంలో జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ స్వామివారికి పూజలు నిర్వహించారు. పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ పాశం రామకృష్ణ, మండల, పట్టణ కన్వీనర్లు నుల కాని వీరాస్వామి నాయుడు, పాల్గొన్నారు. అస్వస్థతకు గురైన రాజేష్ ద్వారకాతిరుమల : జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకాతిరుమలకు పాదయాత్ర చేసిన రాజేష్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.స్వామివార్ల దర్శనం అనంతరం కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులతో జ్వరానికి గురయ్యారు. దీంతో ఆయన్ను పార్టీ నేతలు ద్వారకాతిరుమల పీహెచ్సీ తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేసి 108 ద్వారా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రాజకీయ దురుద్దేశంతోనే విభజన
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతోనే రాష్ట్ర విభజన చేపట్టారని, దీంట్లో రాజకీయ దురుద్దేశం మినహా మరొకటి లేదని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు అన్నారు. శనివారం ఒంగోలు వచ్చిన ఆయనను సమైక్యాంధ్ర దళిత సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయకులు చుట్టుముట్టారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ మొదటినుంచి వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన రాకముందే తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు లాగా రెండు కళ్ల సిద్ధాంతాన్ని తమ పార్టీ నమ్ముకోలేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పార్టీ విశేషంగా కృషి చేస్తోందని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి సమైక్యాంధ్రకు మద్దతు కూడగడతామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంటోని కమిటీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. గవర్నర్ కోటా కింద ఎంపికైన ఎమ్మెల్సీల తరఫున గవర్నర్‌ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వినతి పత్రం అందజేశామని చెప్పారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని, అవసరమైతే ఎలాంటి ఉద్యమానికైనా వెనుకాడేది లేదని వివరించారు. అనంతరం దళిత సంఘాల జేఏసీ కన్వీనర్ దాసరి శివాజీ మాట్లాడుతూ అన్ని దళిత సంఘాలను కలుపుకొని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వివరించారు. -
తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర లేదు
సాక్షి, తిరుపతి: తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర లేదని, అది కేవలం ప్రచారం మాత్రమేనని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. 1969లో చెన్నారెడ్డి సీఎం పదవి కోసం తెలంగాణ ఉద్యమం చేపట్టగా అప్పటి నుంచి 2000 వరకు ఆ ఊసే లేదని, ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. పార్టీ తిరుపతి కార్యాలయంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ స్వీట్లు, మిఠాయిలకు బదులు కారప్పొడిని పంచి పెట్టారు. సీమాంధ్రుల కళ్లలో కొట్టేందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దాన్ని పంపారని తెలి పారు. కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రపై అవగాహన లేని కేసీఆర్ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కోస్తాంధ్ర డబ్బుతో, రాయలసీమ పన్నులతో హైదరాబాద్ నగరాన్ని నిర్మించారని తెలిపారు. స్వాత ంత్య్రం వచ్చాక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని అన్నారు. 1946 నుంచి 1956 వరకు అనేకమంది రజాకార్లు నిజాం సంస్థానం చేతిలో బలయ్యారని, అప్పటి కేంద్ర హోం మంత్రిగా ఉన్న పటేల్ నిజాం సంస్థానాన్ని దేశంలోకి విలీనం చేసుకున్నారని పేర్కొన్నారు. బూర్గుల రామకృష్ణారావు, సురవ రం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి లాంటి వారు ఆంధ్ర ప్రదేశ్‌లోకి తెలంగాణ ను తీసుకున్నారన్నారు. నేటి తెలంగాణ మంత్రుల తాతలు ఆనాడు పట్వారీలుగా ఉంటూ తెలంగాణను పీల్చి పిప్పి చేశారని, వారి వారసులు నేడు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 60 ఏళ్లలో తెలంగాణలో 310 శాతం పాఠశాలలు అభివృద్ధి చెందాయని చెప్పారు. అదే రాయలసీమలో 72, కోస్తాలో 165 శాతం మాత్రమే అభివృద్ధి చెందాయన్నారు. తెలంగాణ లో నీటి పారుదలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయగా రాయలసీమ, కోస్తాంధ్రలో దారుణమైన పరిస్థితి ఉందని అన్నారు. రాయలసీమ వాసులు 1983లో పోరాటాలు జరిపినా అది మెరుగైన సాగునీటి కోసమేనని తెలిపారు. 2004లో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఎస్సార్సీ వేస్తామని చెప్పి టీఆర్ ఎస్తో పొత్తు పెట్టుకోగా, చంద్రబాబునాయుడు పూర్తిగా విభజనకు అంగీకరిస్తూ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని వివరించారు. వైఎస్సార్ సీపీ ప్లీనరీలోనూ అందరికీ సమన్యాయం చేయాలని కోరామని, తెలంగాణకు అనుకూలమని చెప్పలేదని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నగర కన్వీనరు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనరు కుసుమ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాహుల్ కోసమే రాష్ట్ర విభజన
ఆనందపురం (కె.కోటపాడు రూరల్), న్యూస్‌లైన్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేయాలని నిర్ణయించుకున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు ఆరోపించారు. ఆనందపురం గ్రామంలో బుధవారం వైఎస్సార్ సీపీ మండల నేతలు, పలు గ్రామాల కార్యకర్తలు సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ నిర్వహించారు. మూడురోడ్ల కూడలిలో పార్టీ శ్రేణులు మానవహారంగా ఏర్పడి సోనియా, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చొక్కాకుల, పూడి మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారందరూ కలిసి మెలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మాత్రం రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణలో ఎంపీ సీట్లు పొందాలని చూస్తోందన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల కార్యకర్తలు, అభిమానులు 200 బైక్‌లపై ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్ర నినాదాలను హోరెత్తించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు రొంగలి మహేష్, దాట్ల తాతరాజు, ఆళ్ల రామునాయుడు, కొరువాడ సర్పంచ్ చీపురుపల్లి అచ్చిబాబు, లంకవానిపాలెం సర్పంచ్ అవుగడ్డ సోంబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ బతికుంటే విభజన జరిగేదా? మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి బతికుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం జరిగేది కాదని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు అన్నారు. ఎ.కోడూరు గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి బుధవారం ఆయన క్షీరాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయం అమలు కానివ్వొద్దన్న వినతిపత్రాలను వైఎస్ విగ్రహానికి అందించారు. ఈ సందర్భంగా చొక్కాకుల మాట్లాడుతూ వైఎస్సార్ 2004లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తెలంగాణ, సీమాంధ్రలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర ప్రజల్లో నమ్మకమైన నేతగా చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. వైఎస్సార్ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీని 2009లో రాష్ట్ర ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. బైకులతో భారీ ర్యాలీ చౌడువాడ (కె.కోటపాడు): సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త పూడి మంగపతిరావు అధ్యక్షతన బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. చౌడువాడ గ్రామం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో మండలం నలుమూలల నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట రావు ముఖ్యఅతిథిగా చౌడువాడలో జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. చౌడువాడ నుంచి గుల్లేపల్లి, గొండుపాలెం, బత్తివానిపాలెం మీదుగా ర్యాలీ ఆనందపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పూడి మంగపతిరావు, రొంగలి మహేష్, దాట్ల తాతరాజు, బండారు నారాయణపాత్రుడు, రెడ్డి జగన్మోహన్, దాట్ల శివాజీ, ఏటుకూరి రాజేష్, దాలివలస సర్పంచ్ రొంగలి అమ్మతల్లినాయుడు పాల్గొన్నారు. -
పల్లెపల్లెన సమైక్య పోరు
ఒంగోలు, న్యూస్‌లైన్:సమైక్యాంధ్ర నినాదం పల్లెపల్లెనూ కదిలిస్తోంది. ఇప్పటికే ఒంగోలు నగరంతో పాటు, జిల్లాలోని పట్టణ ప్రాంతాలన్నీ ఉద్యమ హోరుతో అట్టుడుకుతుంటే క్రమంగా పల్లెల్లో సైతం సమైక్య నినాదం హోరెత్తుతోంది. పలుచోట్ల సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మలను శనివారం దహనం చేశారు. పర్చూరు నియోజకవర్గంలో న్యాయవాదులు చేపట్టిన 6వ రోజు రిలే దీక్షకు వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ గొట్టిపాటి నరసయ్య సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు గొట్టిపాటి భరత్ తాను సైతం సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆయనకు మద్దతుగా యద్దనపూడి హరిప్రసాద్, బూక్యా రాజానాయక్, పొదిలి రాఘవలు కూడా దీక్షలో కూర్చున్నారు. రాష్ర్టం విచ్ఛిన్నమైతే విద్య, ఉపాధి అవకాశాలు లేక యువత భవిత నాశనమవుతుందని, అందువల్ల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని భరత్ డిమాండ్ చేశారు. ఒంగోలులో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రల కారణంగానే రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిందని, ఆ రెండు పార్టీలు ఆ నెపాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్పైకి నెట్టాలని చూడటం దారుణమన్నారు. ప్రజలు ఇప్పటికైనా గమనించి నాటకాల రాయుళ్లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒంగోలులో న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షకు వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య సంఘీభావం ప్రకటించారు. దక్షిణ బైపాస్‌లో సమైక్యాంధ్ర ఫ్రంట్ 20 నిముషాల పాటు రాస్తారోకో నిర్వహించగా, విద్యార్థి జేఏసీ స్థానిక బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసింది. ఉదయాన్నే చర్చి సెంటర్లో ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు, మధ్యాహ్నం రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు మానవహారం నిర్వహించారు. చీరాలలో 500 మందికిపైగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించి గడియార స్తంభం సెంటర్లో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కనిగిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి కదిరి బాబూరావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం కనిగిరిలోని పామూరు బస్టాండులో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిజ్రాలు కూడా వారితో జత కలిసి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అద్దంకిలో భజన బృందాలు పట్టణ వీధుల్లో భజనలు చేస్తూ రాష్ట్ర విభజనను నిరశించారు. అనంతరం పాత బస్టాండు సెంటర్లో మానవహారం నిర్వహించారు. సంతమాగులూరు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపింది. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఆంధ్రమహాసభ జీపును ఏర్పాటు చేసుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రచార జాతా ప్రారంభించింది. గిద్దలూరులో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసన తెలిపారు. కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలకు సంబంధించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పలువురు నిరసన ర్యాలీ నిర్వహించడంతోపాటు ధర్నా చేపట్టారు. మార్కాపురంలో ఏపీటీసీఏ ఆధ్వర్యంలో 1500 మందికిపైగా విద్యార్థులు ర్యాలీ చేసి కోర్టు సెంటర్లో మానవహారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, వైఎస్సార్సీపీ మార్కాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నా హనుమారెడ్డిలు వారికి సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్, సోనియా, దిగ్విజయ్ సింగ్ దిష్టి బొమ్మలను ఏపీటీసీఏ సభ్యులు దహనం చేశారు. -
విభజిస్తే ఊరుకోం
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: స్వార్థం కోసం రాష్ట్రాన్ని రెండుగా విభజించేందుకు సోనియాగాంధీ చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని, లేదంటే సీమాంధ్ర సత్తా ఏంటో చూపుతామని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం ఆ పార్టీ నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ మనుగడ కనుమరుగు అవుతోందన్న భయంతోనే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం పాల్పడిందని ఆరోపించారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానానికి భయపడి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దొంగ రాజీనామాలతో మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఆనం సోదరులారా బయటకు రండి ‘రాష్ట్ర మంత్రి, రూరల్ ఎమ్మెల్యే ఆనం సోదరులు ఎక్కడ దాక్కున్నారో బాహ్య ప్రపంచంలోకి రండి. మీ ఇంటిముందుకొచ్చాం. దొంగ రాజీనామాలు చేసి బొత్సకు, భానుశ్రీకి ఇవ్వడం కాదు. దమ్ము, ధైర్యం ఉంటే స్పీకర్‌కు ఇచ్చి ఆమోదింప చేసుకుని సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ప్రజా ఉద్యమంలో నేరుగా పాల్గొనండి’ అని కోటంరెడ్డి, అనిల్ సవాల్ విసిరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏం పాపం చేశారని ఆయన విగ్రహాలపై చెయ్యి వేయాలని అనుకుంటున్నారు?. మూడు పర్యాయాలు నిన్ను ఎమ్మెల్యేగా చేశారనా? మీ తమ్ముడిని మంత్రి చేశారనా? మరో ఇద్దరు తమ్ముళ్లకు కాంట్రాక్టు పనులు కట్టబెట్టారనా? లేక భానుశ్రీని మేయర్ చేసినందుకా? వైఎస్సార్ విగ్రహాలను పగులకొట్టండని పిలుపునిస్తారని ఆనం వివేకానందరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఒక్కసారి వైఎస్సార్ విగ్రహాలపై చెయ్యి వేసి చూడండి.. ఏం జరుగుతుందోనని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు భరోసా కల్పిస్తున్న సమయంలో ఆయన్ను జైల్లో పెట్టించి కాంగ్రెస్ నాయకులు నాటకాలు అడుతున్నారన్నారు. ఈ నాటకాలు మరెంతో కాలం సాగవన్నారు. మహా అయితే మరో నాలుగు నెలల పాటు కొనసాగిస్తారేమో అని అన్నారు. ఆ తర్వాత తమ యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. అప్పుడు నీవు ఏమి మాట్లాడినా, ఏం చేసినా ఎవరూ పట్టించుకునే వారే ఉండరని ఆనం వివేకానుద్దేశించి కోటంరెడ్డి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ముప్పసాని శ్రీనివాసులు, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ఎస్కే సుభాన్, షేక్ మాబు, లెక్కల వెంకారెడ్డి, ఆర్.జెస్సీ, సంక్రాంతి కల్యాణ్‌రెడ్డి, మునీర్‌సిద్ధిక్, దార్ల వెంకటేశ్వర్లు, ఎ.బాలకోటేశ్వరరావు, ఎండీ ఖలీల్‌అహ్మద్, ఎస్ఆర్ ఇంతియాజ్, కూకటి ప్రసాద్. జాఫర్మోహిద్దీన్, ఫజల్మన్నడు, దండే లక్ష్మిరెడ్డి, టి.రఘురామిరెడ్డి, ముప్పాల శేషుగౌడ్, కాకుటూరు విజయభాస్కర్‌రెడ్డి, గంధం సుధీర్‌బాబు, రజిని, సుభాషిణి, మీనమ్మ, శ్రావణ్‌కుమార్, హరిప్రసాద్‌నాయుడు, సత్య, అఖిల్, బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, నర్సింహముదిరాజ్, బత్తల వెంకటేశ్వర్లు, పట్రంగి అజయ్, చేజర్ల మహేష్‌బాబు, ప్రశాంత్, కిరణ్, నరేష్, అజీమ్, కారుదుంప దశరథరామయ్యలతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు వేలాది మంది పాల్గొన్నారు.