సినీరంగ కార్మికుల కోర్కెల సాధనకు కోలీవుడ్ మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించింది. దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళన్ (ఫెఫ్సీ) ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది. పరిశ్రమకు చెందిన పలు సంఘాలు పాల్గొని సంఘీభావం ప్రకటించాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: సినీ పరిశ్రమలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు. సరైన జీతభత్యాలు లేవు. ఇటువంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఇటీవలే ఫెఫ్సీ ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో పడింది. తమ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మంగళవారం చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించింది. సినీ కార్మికులతో ఎగ్మూరు రాజరత్నం స్టేడియం నుం చి ఉదయం ర్యాలీ ప్రారంభమైంది. ఫెఫ్సీ అధ్యక్షులు అమర్, కార్యదర్శి శివ, కోశాధికారులు అంగముత్తు, షణ్ముగం పాల్గొన్నారు.
పముఖ సినీ సంగీత దర్శకు లు ఇళయరాజా ఫెఫ్సీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభిం చారు. సినిమా షూటింగ్‌కు వినియోగించే భారీ కెమెరా లు, ఇతర సామగ్రిని చేతబట్టి కార్మికులు నడిచారు. తమిళ సంప్రదాయ నృత్యమైన గరగాట్టం, నెమలినాట్యం, కీలుగుర్రం వంటి ప్రదర్శనలు నిర్వహిస్తూ మరి కొందరు ర్యాలీలో సాగారు. ఫెఫ్సీ ర్యాలీకి సంఘీభా వం ప్రకటించిన తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షులు విక్రమన్, దర్శకులు ఆర్.కె.సెల్వమణి, వి.శేఖర్, పి.వాసు, ఎస్పీ ముత్తురామన్ కార్మికుల వెంట నడిచారు. పుదుప్పేట్టై సమీపంలో సిద్ధం చేసిన వేదికపై నుంచి దర్శకులు, ఇతర నేతలు ప్రసంగించారు. అనంతరం ర్యాలీగా సచివాలయం చేరుకున్నారు.
ముఖ్యమంత్రికి వినతి
తమిళ సినిమా అభివృద్ధికి ప్రభుత్వపరంగా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు పెంచాలని ఇలా 10 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి జయలలితకు సమర్పించారు. నగరంలోని ప్రముఖ ప్రదేశాల్లో, దేవాలయాల్లో సినిమా షూటింగులకు అనుమతించాలని, ఏప్రిల్ 14న చిత్తిరై తిరువిళాను నిర్వహించాలని తదితర కోర్కెలతో కూడిన వినతిపత్రాన్ని దర్శకుల సంఘం అందజేసింది. ఈ సందర్భం గా ఫెఫ్సీ అధ్యక్షులు అమర్ మీడియాతో మాట్లాడారు. తమ కోర్కెలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పం దించారన్నారు. అధికారులతో మాట్లాడారని, న్యా యం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. తమ కోర్కె లు నెరవేరగానే ముఖ్యమంత్రి జయలలితకు భారీ అభినందన సభ నిర్వహిస్తామని వెల్లడించారు.
కోర్కెల సాధనకు ‘కోలీవుడ్’ ర్యాలీ
Published Wed, Nov 6 2013 3:18 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM
Advertisement
Advertisement