సాక్షి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఏకైక డిమాండ్‌తో జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమం గురువారంతో వందరోజులు పూర్తి చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉద్యమం మాత్రం చల్లబడలేదు. రోజూ ఏదోఒక పట్టణంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ వద్ద సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాటసమితి ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేస్తున్నారు.
ఆక్స్‌ఫర్డ్ హైస్కూలు విద్యార్థులు గురువారం నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. అప్సరసర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలు చేశారు. భరతమాత, రాణీరుద్రమ, అల్లూరి సీతారామరాజు వేషధారణలతో అలరించారు. కోర్టువద్ద న్యాయవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రొద్దుటూరులో వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో గురువారం కూడా రిలేదీక్షలు కొనసాగాయి. పులివెందులలో విద్యాధరి పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు పోస్టుకార్డులు పంపించారు. రాజంపేటలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కన్వీనర్ ఎస్‌వీ రమణ ఆధ్వర్యంలో రాజు పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. జమ్మలమడుగులో వైఎస్సార్‌పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలేదీక్షలలో గురువారం సిరిగేపల్లే గ్రామస్తులు దీక్షలకు కూర్చున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కలసపాడులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ఉద్యమం
Published Fri, Nov 8 2013 2:44 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement