సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవడమే లక్ష్యంగా సమైక్యవాదులు పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. 58 రోజులుగా దృఢచిత్తంతో పోరాటం చేస్తున్నారు. మొదటి రోజు ఏ స్ఫూర్తితో ఉద్యమంలోకి దిగారో, అదే పోరాటపటిమతో పోరు కొనసాగిస్తున్నారు. గురువారం సమైక్యవాదులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ప్రైవేటు బస్సులు కదల్లేదు.
ఉద్యమంలో అసువులు బాసిన ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖరరాజు చిత్రపటానికి నెల్లూరు ప్రధాన బస్టాం డ్‌లో ఘన నివాళులర్పించారు. అనంతరం మానవహారం నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కావలి మండలం తుమ్మలపెంట సముద్రతీ రంలో మత్స్యకారులు జలదీక్ష చేపట్టారు. ముత్తుకూరు మండలం డమ్మాయపాళెం స్కూల్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామస్తులు భారీ ర్యాలీ చేసి, వంటావార్పు నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమ పోరాట సమితి ఆధ్వర్యంలో మనుబోలులో ర్యాలీ జరిగింది.
ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖరరాజు మృతికి సంతాపంగా ఉదయగిరిలో బంద్ నిర్వహించారు. కలిగిరి మండలంలో గ్రామచైతన్య యాత్రలు నిర్వహించిన జేఏసీ నాయకులు సమైక్య రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గూడూరులో సోమశేఖరరాజు చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. విద్యార్థులు, ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. చెన్నై వెళుతూ గూడూరు రైల్వేస్టేషన్‌లో దిగిన సినీనటుడు నారాయణమూర్తికి సమైక్యసెగ తగిలింది. వాకాడులోని అశోక స్తంభం సెంట ర్‌లో సమైక్యాంధ్ర జెండా ఆవిష్కరించారు. కోవూరు, లేగుంటపాటు ఆత్మకూరులోని బస్టాండ్ సెంటర్‌లో రిలేదీక్షలు కొనసాగాయి.
ఎల్లసిరి, పాశం ఘన నివాళులు
గూడూరు, న్యూస్‌లైన్: సమైక్యాంద్ర ఉద్యమంలో పాల్గొని ప్రాణాలర్పించిన ఆర్టీసీ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖరరాజు మృతదేహాన్ని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ సందర్శించి ఘన నివాళులర్పించారు. వారితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు నాశిన నాగులు, బొమ్మిడి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, షణ్ముగం నివాళులర్పించి మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పట్టు వదలం
Published Fri, Sep 27 2013 4:20 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement