ఆంధ్రాబ్యాంక్పై బాంబు దాడి | BOMB Petrol bomb hurled at Andhra Bank, no casualties | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్పై బాంబు దాడి

Published Fri, May 1 2015 11:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

ఆంధ్రాబ్యాంక్పై బాంబు దాడి

ఆంధ్రాబ్యాంక్పై బాంబు దాడి

చెన్నై : చెన్నై నగరంలోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్పై ఆగంతకులు శుక్రవారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. బైక్ వచ్చిన దుండగలు ఆంధ్రాబ్యాంక్పైకి బాంబు విసిరి అనంతరం అక్కడి నుంచి వారు పరారైయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

చిత్తూరు జిల్లాలో శేషాచల కొండలపై జరిగిన ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన 20 మంది స్మగ్లర్లు మరణించిన నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్కు నిరసనగా గతనెల 10 వ తేదీన తమిళనాడులోని మూడు ఆంధ్రబ్యాంకులపై తమిళనాడు వాసులు దాడి చేసిన సంగతిని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement