పోలీస్‌ స్టేషన్‌పై పెట్రోబాంబులతో దాడి | petrol bomb attack on chennai police station | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌పై పెట్రోబాంబులతో దాడి

Published Thu, Jul 13 2017 8:40 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

పోలీస్‌ స్టేషన్‌పై పెట్రోబాంబులతో దాడి

పోలీస్‌ స్టేషన్‌పై పెట్రోబాంబులతో దాడి

చెన్నై: చెన్నై తేనాంపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో తీవ్ర సంచలనం కలిగించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు తేనాంపేట పోలీసు స్టేషన్‌పై పెట్రోలు బాంబులు విసిరారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటనా ప్రాంతాన్ని సందర్శించిన పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బందాలను ఏర్పాటుచేశారు. చెన్నై నగర అతి ముఖ్యమైన పోలీసు స్టేషన్లలో ఇది కూడా ఒకటి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివశిస్తున్న పోయెస్‌ గార్డెన్‌ నివాసం, అమెరికా రాయబార కార్యాలయం, ముఖ్య ప్రముఖుల నివాసాలు, నక్షత్ర హోటళ్లు ఈ స్టేషన్‌ పరిధిలోనే ఉన్నాయి.

గురువారం తెల్లవారుజామున నిర్మానుష్యంగా ఉన్న సమయంలో రెండు బైక్‌లలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు పెట్రోలు బాంబులను పోలీసు స్టేషన్‌ వైపు విసిరారు. దీంతో భీకర శబ్ధంతో ఓ బాంబు పేలడంతో అక్కడ మంటలు లేచాయి.   ప్రవేశద్వారం వద్ద మరో బాంబు పేలకుండా పడివుంది. తెల్లవారుజాము కావడంతో పోలీసులు గస్తీ తిరిగేందుకు వెళ్లారు. పోలీసు స్టేషన్‌లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. నలుగురు వ్యక్తులు బైక్‌లలో వచ్చి పోలీసు స్టేషన్‌పై పెట్రోలు బాంబులు విసిరినట్లు పోస్టర్ల వ్యక్తి తెలిపాడు. వెంటనే ఈ సంఘటన గురించి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం తెలిపారు.

దీనికి సంబంధించి ప్రత్యేక బందం పోలీసులు తేనాంపేట పోలీసు స్టేషన్‌లో ఉన్న సీసీ టీవి కెమెరాలను పరిశీలించారు. ఈ పోలీసు స్టేషన్‌ సమీపాన అమెరికన్‌ దౌత్యకార్యాలయం ఉన్నందున ఇందులో అంతర్జాతీయ కుట్ర ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గురువారం రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ 50 ఏళ్ల ప్రజాజీవిత స్వర్ణోత్సవం జరుగనుంది. ఇందులో కూటమి పార్టీల నేతలు పలువురు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసే దష్టితో ఇలా చేశారా? అనే కోణంలోను విచారణ జరుపుతున్నారు. ఈ సంఘనట చెన్నైలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో తేనాంపేట పరిసరాలలో తీవ్ర పోలీసు భద్రత కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement