సాక్షి, బెంగళూరు: పెట్రోల్ బాంబు దాడులతో కర్ణాటకలోని మడికెరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి జిల్లాలోని ఐగూరు గ్రామంలో మడికెరి జిల్లా భజరంగ్‌దళ్ కన్వీనర్ పద్మనాభం కారుపై కొందరు దుండగులు దాడి చేసి అద్దాలను పగలగొట్టి, కారుపై పెట్రోల్ బాంబు వేసి ఉడాయించారు. ఈ సమయంలో పద్మనాభం కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అప్పచ్చురంజన్, హిందూ పోరాట సంఘాల కార్యకర్తలు జిల్లాలో సమ్మెలు, రాస్తారోకోలు నిర్వహించారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే భజరంగ్‌దళ్ నేత కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం గమనార్హం.
పెట్రోల్ బాంబు దాడులతో కర్ణాటకలో ఉద్రిక్తత
Published Tue, Nov 15 2016 3:32 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
Advertisement
Advertisement