ఆ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్ | Madurai MLA arrest warrant | Sakshi
Sakshi News home page

ఆ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్

Published Thu, Jun 18 2015 2:33 AM | Last Updated on Mon, Oct 8 2018 4:05 PM

మదురై ఎమ్మెల్యేకు అరెస్టు వారెంట్ జారీ అయింది. రామేశ్వరం రైల్వే స్టేషన్‌లో 2013లో జరిగిన రైల్వే ఉద్యోగుల కార్మిక సంఘం ఎన్నికల్లో ఇరువర్గాల

టీనగర్: మదురై ఎమ్మెల్యేకు అరెస్టు వారెంట్ జారీ అయింది. రామేశ్వరం రైల్వే స్టేషన్‌లో 2013లో జరిగిన రైల్వే ఉద్యోగుల కార్మిక సంఘం ఎన్నికల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకున్న పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. రైల్వే ఉద్యోగులు, సీపీఎం కార్యకర్తలపై పోలీసులు దాఖలు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ మదురై సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నాదురై నేతృత్వంలో ఆ పార్టీ వారు రామేశ్వరంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ర్యాలీ జరిపారు. దీనికి సంబంధించిన కేసులో ఎమ్మెల్యే అన్నాదురై, రామేశ్వరం సీపీఎం నిర్వాహకులు వడకొరియ, జస్టిన్ అనే ముగ్గురు హాజరుకాలేదు. కేసుపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ ఇళవరసి ఎమ్మెల్యే అన్నాదురై సహా ముగ్గురికి అరెస్టు వారెంట్ జారీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement